కరోనా మహమ్మారితో గత రెండేండ్లుగా ఎంతో మంది తాము ప్రేమించేవారిని, కుటుంబ సభ్యులు, స్నేహితులను కోల్పోయారు. మాజీ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ షాకిల్ ఓనీల్ (49)ను కూడా విషాదం వెంటాడింది. కరోనాతో తన సోదరి ఆయేషా హారిసన్, ఫ్రెండ్ కోబ్ బ్య్రాంట్ను కోల్పోయిన ఓనీల్ తనకు తెలిసిన మరో 28 మందిని కూడా మహమ్మారి పొట్టనపెట్టుకోవడంతో కుంగిపోయాడు.
మానసికంగా, శారీరకంగా డీలా పడిన ఓనీల్ పట్టుదలతో కొద్దినెలల కష్టంతో తిరిగి మునుపటి ఫిట్నెస్ను సాధించడంతో పాటు మానసికంగానూ ధృడంగా మారాడు. తక్కువ కార్బోహైడ్రేట్, హై ప్రొటీన్ డైట్‌తో కొవ్వు కరిగించడంతో పాటు కండలను పెంచానని ఓనీల్ చెబుతున్నాడు. బ్రెడ్, ఓరియోస్, కేకులను పక్కనపెట్టి కొద్దిమొత్తంలో కూరగాయలు, పండ్లు, సలాడ్స్, ప్రొటీన్ షేక్స్, చికెన్, ఫిష్‌లను తీసుకోవడం మొదలుపెట్టాడు.
రోజుకు గంటపాటు కార్డియో, స్విమ్మింగ్, పుషప్స్ వంటి పలు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేశాడు. జిమ్ ఎంతసేపు చేశామనేది కాకుండా కుదురుగా క్రమం తప్పకుండా చేయడమే ముఖ్యమని ఓనీల్ చెబుతున్నాడు. బిజీ షెడ్యూల్‌తో రేపు చేద్దామని వాయిదా వేయకుండా ఇప్పుడే చేసేద్దాం అని వ్యాయమాన్నినిలకడగా కొనసాగించాలని ఇందుకు మైండ్‌సెట్ ముఖ్యమని చెప్పాడు.