న్యూఢిల్లీ : ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవడం ద్వారా జీవిత కాలాన్ని పదేండ్ల పాటు పొడిగించుకోవచ్చని జర్నల్ నేచర్ ఫుడ్లో ప్రచురితమైన (New Study) అధ్యయనం వెల్లడించింది. మెరుగైన జీవన శైలితో జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చని యూకే బయోబ్యాంక్ డేటాను విశ్లేషించి ఈ అధ్యయనం ఆసక్తికర వివరాలను తెలిపింది. 40ల్లో ఉన్న వ్యక్తులు అనారోగ్యకర ఆహారాల నుంచి ఆరోగ్యకర ఆహారానికి మళ్లితే తమ జీవితకాలాన్ని పదేండ్లు పొడిగించుకోవచ్చని ఈ అధ్యయనం తెలిపింది.
మహిళలు ఆరోగ్యకర ఆహారాన్ని అలవరుచుకుంటే తమ జీవితకాలాన్ని 10.8 ఏండ్ల పాటు పొడిగించుకోగలుగుతారని వెల్లడించింది. మీరు ఎంత త్వరగా మీ ఆహారంలో మెరుగైన మార్పులు చేసుకుంటారో జీవిత కాలంపై అంత ప్రభావం ఉంటుందని తెలిపింది. 40ల్లో ఆరోగ్యకర ఆహారాలు తీసుకున్న వారు మెరుగైన ప్రయోజనాలు పొందుతారని, 70ల్లో ఈ మార్పులు చేసుకున్న వారు యువత పొందే ప్రయోజనాల్లో సగం పొందుతారని అధ్యయనం పేర్కొంది. ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకునేందుకు క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి గ్రెయిన్స్ అధికంగా తీసుకోవాలి.
వీటిలో ఉండే అత్యవసర పోషకాలు, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని పెంచి జీవితకాలాన్ని మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్యకర కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే బాదంపప్పు, జీడిపప్పు, వాల్నట్స్ వంటి నట్స్ అధికంగా తీసుకోవాలి. ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవించాలంటే ఈ ఆహారం తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గ్రెయిన్స్
నట్స్
పండ్లు
చేపలు, వైట్ మీట్
మిల్క్, డైరీ ఉత్పత్తులు
కూరగాయలు , పప్పు ధాన్యాలు
ఇక ఆరోగ్యకర ఆహారం తీసుకోవడంతో పాటు షుగర్స్, ప్రాసెస్డ్ మీట్, రెడ్ మీట్, ఎగ్స్, రిఫైన్డ్ గ్రైన్స్ వంటివి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలిగి జీవితకాలం పెరుగుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Read More :