న్యూఢిల్లీ : కడుపు నిండా భోజనం చేసిన తర్వాత పాన్ లేదా సోంపు (Saunf) లేనిదే లంచ్ లేదా డిన్నర్ పూర్తికాదు. మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేసే సోంపు జీర్ణశక్తిని ప్రేరేపించడంతో పాటు పలు ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది. సోంపు సువాసన కలిగించే రుచిని అందించడంతో పాటు మనం తీసుకున్న ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది.
సోంపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సోంపు తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి మెరుగవడంతో పాటు కడుపు ఉబ్బరం, వికారం వంటి లక్షణాలను నియంత్రిస్తుంది. శరీరంలో నుంచి వ్యర్ధాలను తొలగిస్తుంది. సోంపులో జీవక్రియల వేగం పెంచే ఔషధ గుణాలు ఉన్నాయి.
భోజనం చేసిన అనంతరం శరీరంలో జనించే ఉష్ణాన్ని తొలగించే కూలింగ్ ఎఫెక్ట్‌ను సోంపు కలిగిఉంటుంది. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించే పలు యాంటీఆక్సిడెంట్లు సోంపులో ఉంటాయి. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. సోంపులో ఉండే ఆహార పదార్ధాల్లోని వాసనలను నివారించే ఔషధ గుణాలు నోటి దుర్వాసనను పోగొడతాయి.
Read More :
AIATSL Recruitment | పదో తరగతి అర్హతతో 998 ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.21,000 వరకూ జీతం