AIATSL Mumbai Recruitment | ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో హ్యాండీమాన్ (Handyman), యుటిలిటీ ఏజెంట్ (Utility Agent) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం ముంబయి కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు ఎస్ఎస్సీ/ 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. హ్యాండీమాన్ పోస్టులకు ఎస్ఎస్సీ/ 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబర్ 18 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. శారీరక దారుఢ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 998
పోస్టులు : హ్యాండీమాన్, యుటిలిటీ ఏజెంట్
అర్హతలు : యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు ఎస్ఎస్ఎసీ/ 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. హ్యాండీమాన్ పోస్టులకు ఎస్ఎస్ఎసీ/ 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
వయసు: 28 ఏండ్లు మించకూడదు
జీతం: నెలకు రూ.21330
ఎంపిక : శారీరక దారుఢ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆఫ్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.500
వెబ్సైట్ : www.aiasl.in
అడ్రస్ : HRD డిపార్ట్మెంట్, AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, GSD కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, CSMI ఎయిర్పోర్ట్, టెర్మినల్-2, గేట్ నం. 5, సహర్, అంధేరి-ఈస్ట్, ముంబై-400099.
దరఖాస్తు చివరి తేది: సెప్టెంబర్ 18