Healthy foods | జంక్ ఫుడ్స్ వద్దు.. ఈ ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలే ముద్దు..
Healthy foods | జంక్ ఫుడ్ కనబడగానే మన నోట్లో నీళ్లూరడం చాలా సహజం. అంతలా మనం దానికి బానిసలా మారామన్నమాట. జంక్ ఫుడ్‌తో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకని వీటికి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడం చాలా ఉత్తమం.
Healthy foods | మన నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ మంచి రుచిని కోరుకుంటాయి. జంక్ ఫుడ్ దొరికతే ఎంతో హ్యాపీగా ఫీలవుతాయి. నాలుకను సంతృప్తి పరచడమే ధ్యేయంగా జంక్ ఫుడ్ లాగించేస్తుంటాం. బర్గర్లు, ఫ్రైడ్ ఫుడ్స్ ఆకర్శణీయంగా ఉండి మన ఆకలిని చంపేస్తుంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నించేప్పుడు కూడా జంక్ ఫుడ్‌లో మునిగిపోవాలనే కోరిక బలంగా వస్తుంటుంది. జంక్ ఫుడ్‌ను క్రమం తప్పకుండా తింటే ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. జంక్ ఫుడ్‌కు ప్రత్యామ్నాయంగా రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను తెలుసుకునేందుకే ఈ కథనం అందిస్తున్నాం.
జంక్ ఫుడ్ ఎందుకు హానికరం..
జంక్ ఫుడ్‌లో మన ఆరోగ్యాన్ని చెడగొట్టే కొవ్వులు, చక్కెరలు, లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో పోషక విలువలు.. విటమిన్లు, ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. క్రమం తప్పకుండా జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఊబకాయం, చర్మంపై ప్రభావం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, శ్వాసకోశ వ్యవస్థపై హానికరమైన ప్రభావం వంటి ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి.
జంక్ ఫుడ్‌కు ప్రత్నామ్నాయాలు..
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్లలో ఎన్నో ఖనిజాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కలిగి ఉంటాయి. ఇది గుండె సంబంధ సమస్యలను నివారిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. శక్తిని పెంచుతుంది.
బ్లూ బెర్రీస్
బ్లూ బెర్రీస్ అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్లు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆక్సిడేటివ్ నష్టాన్ని నివారిస్తుంది.
పిస్తా పప్పు
ఏదైనా తినాలన్న కోరిక కలిగినప్పుడు ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే పిస్తా పప్పులను నోట్లో వేసుకుంటే సరి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలోని కొవ్వులను మెరుగుపరుస్తుంది. క్యాలరీలు ఎక్కువగా ఉంటున్నందున తక్కువ మొత్తంలో తినడం మంచిది.
స్వీట్ పొటాటో
స్వీట్ పొటాటోల్లో పోషక విలువలు అనేకం ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. పేగు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పీనట్ బటర్
పీనట్ బటర్‌ను నిత్యం వాడటం వలన శరీరం బరువును తగ్గించుకోవచ్చు. బాడీ బిల్డింగ్తోపాటు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గడం, చక్కెర స్థాయిలు తగ్గడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడడం వంటి బహుళ ప్రయోజనాలను పొందవచ్చు.
పాప్‌కార్న్
పాప్‌కార్న్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉండి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.
చివరగా..
జంక్ ఫుడ్స్ తినడం మంచిది కాదు అనే విషయం తెలిసిన తర్వాత వాటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. ఇలా ఎంచుకునే ముందు మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే లేదా మందులు తీసుకుంటున్న పక్షంలో, ఆహారంలో ఏదైనా మార్పులు చేసే ముందు వైద్యుడ్ని సంప్రదించడం మరిచిపోవద్దు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

