Pumpkin Seeds | గుమ్మడికాయ విత్తనాల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక విటమిన్లు, మినరల్స్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు సైతం సమృద్ధిగా ఉంటాయి. ఈ విత్తనాల్లో జింక్, మెగ్నిషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కండరాల పనితీరుకు దోహదపడతాయి. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. గుమ్మడికాయ విత్తనాల్లో ప్రోటీన్లు, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ విత్తనాలను తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. గుమ్మడికాయ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది వాపులను తగ్గిస్తుంది. కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా రక్షిస్తుంది. ఈ విత్తనాలను రోజూ తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
గుమ్మడికాయ విత్తనాల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నిషియం, జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. గుమ్మడికాయ విత్తనాలను నేరుగా అలాగే తినవచ్చు. లేదా రోస్ట్ చేసి తినవచ్చు. ఇతర ఆహారాలతో కలిపి కూడా తినవచ్చు. గుమ్మడికాయ విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది ప్రోస్టేట్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం గుమ్మడికాయ విత్తనాలను తరచూ తినడం తినడం వల్ల బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా (బీపీహెచ్) వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. దీంతోపాటు హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
గుమ్మడికాయ విత్తనాల్లో ట్రిప్టోఫాన్ అనే సహజ సిద్ధమైన అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో సెరొటోనిన్, మెలటోనిన్ల ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో రాత్రిపూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. రాత్రి పూట గుమ్మడికాయ విత్తనాలను తింటే ఎంతో ఫలితం ఉంటుంది. ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటంది. ఇది ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం తేమగా మారుతుంది. చర్మం పగలకుండా చూసుకోవచ్చు. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు.
గుమ్మడికాయ విత్తనాల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. శరీరంలోని వాపులు కూడా తగ్గుతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. గుమ్మడికాయ విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. ఈ విత్తనాల్లో ఉండే మెగ్నిషియం శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహించేలా చేస్తుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ నుంచి విముక్తి పొందవచ్చు. ఇలా గుమ్మడికాయ విత్తనాలను రోజూ తినడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.