ఆయాసం, వాంతులు, మలబద్ధకం, గ్యాస్, అవాంఛితంగా బరువు పెరగడం, బరువు తగ్గడం, నిద్రలేమి, అలసట ఇవన్నీ పేగుల అనారోగ్యాన్ని సూచిస్తాయి. ఇక పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రొబయోటిక్ ఆహార పదార్థాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటికోసం ఎక్కడో వెతకాల్సిన పన్లేదు. మన వంటల్లోనే ఉన్నాయి.
రసం: పప్పు, చింతపండు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు రసం తయారీకి ముడిసరుకులు. వీటిలో ఎ, సి విటమిన్లు, మెగ్నీషియం, ఇనుము, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. రసంలో పీచు పదార్థాలూ ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు గొప్పగా ఉపయోగపడతాయి.
కఢీ: దీన్ని శనగపిండితో చేస్తారు. ఇందులో పుష్కలంగా ఉండే మెగ్నీషియం, ఫైబర్ పేగుల ఆరోగ్యానికి అత్యవసరం. కడుపునొప్పి, మలబద్ధకం, బరువు తగ్గడానికి వంటింటి చిట్కా కఢీ.
మెంతికూర: బరువు తగ్గడం, మలబద్ధకం లాంటి పేగులకు సంబంధించిన సమస్యలలో మెంతులు ఎంతో సహాయకారి. ఈ ఆహార పదార్థాలకు అదనంగా వ్యాయామం, యోగా, తగినన్ని నీళ్లు పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.