Plants For Mosquitoes | ఎన్ని సీజన్లు మారినా కూడా దోమలు అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వర్షాకాలం సీజన్లోనే కాదు, ప్రతి కాలంలోనూ దోమలు మనల్ని కుట్టి ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే దోమలు అంటే ప్రజలు హడలిపోతుంటారు. ముఖ్యంగా చిన్నారులను దోమలు కుట్టి వారికి ఎక్కడ జ్వరాలు వస్తాయో, వారు ఎలా ఇబ్బంది పడతారో అని పెద్దలు ఆందోళన చెందుతారు. ఈ క్రమంలోనే దోమలను తరిమేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పలు రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే అవి దోమలను తరిమే ఔషధ మొక్కలుగా పనిచేస్తాయి. అలాగే గాలిని సైతం శుద్ధి చేస్తాయి. కొన్ని రకాల మొక్కల నుంచి వచ్చే వాసన దోమలకు పడదు. ఈ క్రమంలో అలాంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా సులభంగా దోమలను తరిమేయవచ్చు.
దోమలను తరిమేయడంలో ది ఫోర్ ఒ క్లాక్ ఫ్లవర్ (The four o’ clock flower) అనే మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. దీన్నే Mirabilis Jalapa అనే శాస్త్రీయ నామంతోనూ పిలుస్తారు. ఈ మొక్క పెరూ దేశానికి చెందినది. మన దేశంలో ప్రస్తుతం అనేక నర్సరీల్లో దీన్ని విక్రయిస్తున్నారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇది మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో పూలను పూస్తుంది. కనుకనే ఆ మొక్కకు ఆ పేరు వచ్చింది. ఈ మొక్కకు చెందిన పువ్వులు దోమలను తరిమేస్తాయి. అలాగే దోమ లార్వాను కూడా నాశనం చేస్తాయి. ఈ మొక్కను ఇంట్లో ద్వారాలు, కిటికీల వద్ద చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీంతో దోమలను తరిమేయవచ్చు. దోమల నుంచి రక్షణ లభిస్తుంది.
తులసి మొక్కను సాధారణంగా చాలా మంది ఇంటి బయట పెంచుతారు. కానీ దీన్ని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీని నుంచి వచ్చే వాసన దోమలకు పడదు. కనుక తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. తులసి ఆకులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉండి పలు వ్యాధులను నయం చేయడంలో సహాయం చేస్తాయి. తులసి ఆకులకు దోమలను తరిమే శక్తి ఉంటుంది. తులసి ఆకుల రసాన్ని కొద్దిగా తీసుకుని నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని బాటిల్లో పోసి ఇంట్లో దోమలు ఉండే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. దీని వల్ల దోమలు పారిపోతాయి. అలాగే ఇంట్లో తులసి మొక్కను కూడా పెంచుకోవచ్చు. ఇక లావెండర్ అనే మొక్కను సైతం ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది కూడా దోమలను తరిమేస్తుంది. లావెండర్ మొక్క పువ్వుల నుంచి అద్భుతమైన వాసన వస్తుంది. ఇది దోమలకు నచ్చదు. కనుక ఈ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే మేలు జరుగుతుంది. ఈ మొక్క గాలిని సైతం శుద్ధి చేస్తుంది. స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. కనుక లావెండర్ మొక్కను ఇంట్లో పెంచుకోవాలి.
బంతి పూల మొక్కలను చాలా మంది తమ ఇంటి ఆవరణలో పెంచుకుంటారు. అయితే ఈ మొక్కలను ఇంట్లోనూ పెంచుకోవచ్చు. ఈ పువ్వుల నుంచి వచ్చే వాసన కూడా దోమలకు పడదు. బంతి పూల మొక్కలు కూడా దోమలను తరిమేస్తాయి. ఈ పువ్వులను కాస్తంత నలిపి చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు. ఇలా ఈ మొక్క మనకు దోమల నుంచి రక్షణను అందిస్తుంది. అలాగే ఈ మొక్కలు గాలిని సైతం శుద్ధి చేయగలవు. కనుక ఈ మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇక జెరేనియం (Geranium) అనే మొక్కను ఇంట్లో పెంచుకుంటున్నా ఉపయోగం ఉంటుంది. ఈ మొక్క పువ్వుల వాసన నిమ్మకాయల వాసనను పోలి ఉంటుంది. ఈ మొక్క వాసన కూడా దోమలకు నచ్చదు. కనుక ఈ మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇలా ఆయా మొక్కలను ఇంట్లో పెంచుకుంటే దోమలను సులభంగా తరిమేయవచ్చు.