Chicken | మాంసాహార ప్రియులు చాలా మంది చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్‌తో ఏ వెరైటీ చేసుకుని తిందామా అని ఎదురు చూస్తుంటారు. ఇక బంధువులు వచ్చినప్పుడు సరే సరి. మాంసాహారం లేనిదే ముద్ద దిగదు. వారాంతాల్లో మాత్రమే కాకుండా వారం మధ్యలోనూ చికెన్‌తో వంటకాలు చేసి లాగించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే చికెన్ తినడం వరకు బాగానే ఉంటుంది కానీ కొందరు మాత్రం చికెన్‌ను అసలు ముట్టకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు చికెన్‌ను తినకూడదని వారు అంటున్నారు. చికెన్‌ను అసలు ఎవరు తినకూడదు.. అన్న వివరాలను వారు తెలియజేస్తున్నారు.
పౌల్ట్రీ.. అంటే కోళ్ల ఉత్పత్తులు అంటే అలర్జీలు ఉన్నవారు చికెన్‌ను తినకూడదు. చికెన్ అంటే కొందరికి అలర్జీ ఉంటుంది. అలాంటి వారు చికెన్‌ను తినకూడదు. తింటే శరీరంపై దద్దుర్లు ఏర్పడుతాయి. దురదలు వస్తుంటాయి. ఇలా వస్తున్నాయంటే అలాంటి వారు చికెన్‌ను తినకపోవడమే మంచిది. అయితే ఈ లక్షణాలు కొందరిలో చాలా తక్కువగా ఉండవచ్చు. కొందరికి అధికంగా కనిపిస్తాయి. కనుక అలర్జీ ఉన్నవారు చికెన్‌ను తినకూడదు. కొందరికి చికెన్‌ను తిన్నప్పుడల్లా విరేచనాలు అవుతుంటాయి. కడుపు నొప్పి వస్తుంటుంది. అయినప్పటికీ వారు చికెన్‌ను తినడం మానరు. కానీ అలాంటి లక్షణాలు కూడా అలర్జీ కిందకే వస్తాయి. కనుక వీరు కూడా చికెన్‌ను తినకూడదు. లేదంటే తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
కొందరికి గౌట్ సమస్య ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా పేరుకుపోతే గౌట్ వస్తుంది. దీని వల్ల కీళ్లలో స్పటికాలు ఏర్పడి వాపులకు గురవుతాయి. నొప్పి వస్తుంది. అయితే గౌట్ సమస్య ఉన్నవారు చికెన్‌ను తినకూడదు. వీరు అసలు మాంసం ముట్టకూడదు. లేదంటే శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి అయి గౌట్ సమస్య మరింత పెరుగుతుంది. అప్పుడు నొప్పి, వాపులు ఇంకా ఎక్కువవుతాయి. కొందరికి కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గౌట్ ఉన్నవారు కూడా చికెన్ జోలికి వెళ్లకూడదు. అలాగే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు కూడా చికెన్‌ను తినకపోవడమే మంచిది. లేదంటే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. శరీరంలో చేరే వ్యర్థాలను బయటకు పంపేందుకు కిడ్నీలు శ్రమిస్తాయి. ఇలాంటి తరుణంలో మాంసాహారం తినడం మంచిది కాదు. కాబట్టి కిడ్నీ వ్యాధులు ఉన్నా కూడా చికెన్‌కు దూరంగా ఉండాలి.
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు కూడా చికెన్ తినకపోవడమే మంచిది. చికెన్‌లోనూ కొలెస్ట్రాల్ ఉంటుంది. దాన్ని తింటే ఆ కొలెస్ట్రాల్ మన శరీరంలో చేరుతుంది. ఆరోగ్యవంతులు అయితే ఫర్వాలేదు. కానీ అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ మరింత ఎక్కువవుతుంది. ఇది గుండె జబ్బులను కలగజేస్తుంది. హార్ట్ ఎటాక్ కు కారణం అవుతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చేలా చేస్తుంది. కనుక కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు చికెన్‌ను తినకూడదు. అలాగే గర్భిణీలు చికెన్ తినే విషయంలో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. చిన్నారులకు చికెన్ పెట్టే ముందు తల్లిదండ్రులు వైద్యుల సలహాను పాటిస్తే మంచిది. వారికేమైనా అలర్జీలు ఉంటే చికెన్‌ను పెట్టకూడదు.