Peepal Tree | మన చుట్టూ పరిసరాల్లో అనేక చెట్లు పెరుగుతుంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉన్న చెట్లు అనేకం ఉంటాయి. కానీ అలాంటి చెట్ల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో రావి చెట్టు కూడా ఒకటి. దేవాలయాల్లో మనకు రావి చెట్టు ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి చాలా మంది పూజలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక పరంగానే కాక రావి చెట్టు ఆరోగ్య పరంగా కూడా లాభాలను అందిస్తుంది. దీని బెరడు, ఆకులు, వేళ్లను అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. ఆయా భాగాలతో అనేక ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తారు. రావి చెట్టు వల్ల మనకు ప్రయోజనాలు కలుగుతాయి. దీని భాగాలను సరిగ్గా ఉపయోగిస్తే అనేక లాభాలను పొందవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారికి రావి చెట్టును వరంగా చెప్పవచ్చు. రావి చెట్టు ఆకులను తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను ఒక కప్పు మోతాదులో రోజూ ఉదయం, సాయంత్రం 2 పూటలా భోజనానికి 30 నిమిషాల ముందు సేవిస్తుండాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రావి చెట్టు ఆకులను తీసుకుని మెత్తగా నూరి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుని గంట సేపు అయ్యాక కడిగేయాలి. రాత్రి పూట ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుని పాదాలకు కవర్ లాంటిది చుట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా పాదాల పగుళ్లు తగ్గి పాదాలు మృదువుగా మారుతాయి. రావి చెట్టు బెరడును తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను నోట్లో పోసుకుని పుక్కిలిస్తుండాలి. రోజూ ఇలా చేస్తుంటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
బాగా పండిన రావి చెట్టు పండును రోజూ రాత్రి పూట నిద్రకు ముందు తినాలి. దీంతో మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. రావి చెట్టు పండ్లను తింటుండడం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది. ఆకలి లేని వారు ఈ పండ్లను తింటే అజీర్తి తగ్గుతుంది. ఆకలి బాగా అవుతుంది. బాగా పండిన రావి చెట్టు పండ్లను తింటుంటే ఆస్తమా నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. రావి చెట్టు ఆకలను 2 లేదా 3 తీసుకుని వీటికి 50 గ్రాముల బెల్లం కలిపి మొత్తం మిశ్రమాన్ని చిన్నపాటి గోళీల్లా తయారు చేసుకోవాలి. దీనిని ఉదయం, సాయంత్రం ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలి. దీంతో కడుపు నొప్పి తగ్గుతుంది.
రావి చెట్టు పండ్లకు కాస్త తేనె కలిపి తింటుంటే రక్తం తయారవుతుంది. రక్త శుద్ధి జరుగుతుంది. రక్తంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. అలాగే ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. రావి చెట్టు ఆకుల నుంచి రసం తీసి దాన్ని చెవిలో 2 లేదా 3 చుక్కల మోతాదులో వేస్తుండాలి. దీంతో చెవి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. చెవి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రావి చెట్టు పండ్లను ఎండ బెట్టి పొడి చేసి దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని పాలలో కలిపి రోజూ రాత్రి తాగాలి. దీని వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. నపుంసకత్వం తగ్గుతుంది. రావి చెట్టు బెరడును కషాయంలా కాచి తాగుతుంటే దురదలు తగ్గుతాయి. అన్ని రకాల చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇలా రావి చెట్టు మనకు ఎంతో మేలు చేస్తుంది.