వరల్డ్ క్యాన్సర్ డే : ఒబెసిటీతో క్యాన్సర్ ముప్పు
ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వైద్య నిపుణులు ఈ మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వైద్య నిపుణులు ఈ మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, ముందు జాగ్రత్త చర్యలపై నిపుణులు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. క్యాన్సర్ కేసులు పెరగడంలో ఈ వ్యాధి బారినపడటంలోనూ ఊబకాయం కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా స్ధూలకాయం, తీవ్ర ఒబెసిటీ అనేది సహజంగా మారింది.
2-19 ఏండ్ల వయసు వారిలో స్ధూలకాయం, తీవ్ర ఒబెసిటీ పెరుగుతోంది. క్యాన్సర్, ఒబెసిటీ మధ్య సంబంధం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ వైభవ్ చౌధురి తెలిపారు. పురుషుల్లో 11.9 క్యాన్సర్ కేసులకు ఒబెసిటీ కారణమని, మహిళల్లో 13.1 శాతం క్యాన్సర్ కేసులకు ఒబెసిటీ కారణమని ఆయ వివరించారు. అధిక బరువు 13 రకాల క్యాన్సర్లు సోకే ముప్పును పెంచుతుందని చెప్పారు.
అధిక బరువు ఉన్నవారిలో ఎండోమెట్రియల్, మలద్వార, ప్యాంక్రియాటిక్, మెలెమా, కోలోరెక్టల్, గాల్‌బ్లాడర్, థైరాయిడ్ క్యాన్సర్ల వంటి 13 రకాల క్యాన్సర్ ముప్పు అధికమని పేర్కొన్నారు. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడం ద్వారా వాపు తలెత్తడంతో క్యాన్సర్‌కు దారితీస్తోందని చెప్పారు. శరీరం ఇన్సులిన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను శరీర కొవ్వు ప్రభావితం చేస్తుందని వివరించారు. అధిక విసరల్ కొవ్వు ద్వారా దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్ శరీరాన్ని దెబ్బతీసి క్యాన్సర్ ముప్పు పెంచుతుందని అన్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

