న్యూఢిల్లీ : గణేష్ చతుర్ధి (Ganesh Chaturthi Fast) రోజు ఉపవాసం ఉండే భక్తులు కొన్ని సూచనలు పాటించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం ద్వారా శరీరం డీటాక్సిఫికేషన్ అవడంతో పాటు బరువు పెరగకుండా చూసుకోవడం, జీవక్రియల వేగం పెరగడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే ఆరోగ్యపరమైన సమస్యలు దరిచేరకుండా ఉపవాసం చేయడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పండుగల సమయంలో ఉపవాస వేళ ఎంపిక చేసుకునే ఆహార పదార్ధాల విషయంలో జాగ్రత్త వహించాలి.
ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఉపవాస దీక్షకు ముందు ఉపవాసం ముగిసిన తర్వాత తీసుకోవాలి. ఎనర్జీని రోజంతా కొనసాగించేందుకు బాదం, పనీర్, కర్డ్, నట్స్ వంటివి తీసుకోవాలి. బాదంలో ప్రతి 30 గ్రాముల్లో 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇవి ట్రాన్స్‌ఫాట్స్ లేకుండా, ఆరోగ్యకర మోనోఅన్శాట్యురేటెడ్ కొవ్వులను కలిగిఉంటాయి. బాదం గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చర్మం మెరిసేందుకు, మధుమేహ నియంత్రణకు మేలు చేస్తాయి.
ఉపవాసం విరమించే క్రమంలో ముందుగా నీరు తీసుకుని ఆపై తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్లు, ఫైబర్, ఆరోగ్యకర కొవ్వులతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. పండుగ వేళ స్వీట్లు అతిగా తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ముప్పు ఉండటంతో డేట్స్ వంటి సహజమైన స్వీటెనర్స్ తీసుకోవడం మేలు. ఉపవాసం ఉండే సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. తగినంత నీరు తరచూ తీసుకోవాలి.
Read More :