లండన్ : ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారి చికిత్సలో సమర్ధవంతంగా పనిచేసే ఔషధాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇది కొవిడ్-19కు దారితీసే సార్స్-కోవ్-2 వైరస్ పునరుత్పత్తిని నిరోధిస్తుంది. ఇన్ఫెక్షన్కు గురైన కణాలు బహుముఖం కాకుండా నిరోధించడం ద్వారా ఈ మందు వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. సార్స్-కోవ్-2 సోకిన కరణాలు పెంటోస్ ఫాస్పేట్ పాథ్వేగా పిలిచే మెటబాలిక్ పాథ్వేను యాక్టివేట్ చేయడం ద్వారా కరోనా వైరస్లు పుట్టుకొస్తాయని జర్నల్ మెటబాలిటీస్లో ప్రచురితమైన అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు.
బెన్ఫూక్సిధైమైన్ అనే ఔషధం ఇన్ఫెక్షన్ సోకిన కణాలు కరోనా వైరస్లను తయారుచేయకుండా నిలువరిస్తుందని బ్రిటన్లోని కెంట్ యూనివర్సిటీ, జర్మనీలోని గోతె యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. కొవిడ్-19 చికిత్స పరిశోధనల్లో ఇది కీలక ముందడుగని కెంట్ వర్సిటీ ప్రొఫెసర్ మార్టిన్ మైఖేల్స్ వెల్లడించారు. ఈ మందును విడిగా లేదా ఇతర చికిత్సలతో కలిపి కొవిడ్-19 ట్రీట్మెంట్లో సమర్ధవంతంగా వాడవచ్చని చెప్పారు.