Rotis | చపాతీలు.. ఈ పేరు చెప్పగానే మనకు గోధుమ పిండితో చేసే చపాతీలే గుర్తుకు వస్తాయి. చాలా మంది ఈ పిండితోనే చపాతీలను తయారు చేసి తింటారు. చపాతీలు వాస్తవానికి ఎంతో రుచిగా ఉంటాయి. ఏ కూరతో అయినా సరే తినవచ్చు. అధిక బరువు తగ్గాలని చూసేవారు, షుగర్ ఉన్నవారు, ఇతర అనారోగ్య సమస్యలు లేదా వ్యాధులు ఉన్నవారు రాత్రి పూట అన్నం మానేసి చపాతీలను తింటుండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే నిజానికి చపాతీలను కేవలం గోధుమ పిండితోనేకాదు, పలు ఇతర చిరుధాన్యాలకు చెందిన పిండిలతోనూ తయారు చేయవచ్చు. అవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఆయా పిండిలతో తయారు చేసే చపాతీలను రాత్రి పూట తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. రోజూ కేవలం గోధుమ పిండితోనే కాకుండా వివిధ రకా చిరు ధాన్యాలతోనూ పిండి తయారు చేసి దాంతో చపాతీలను తయారు చేసి తింటుంటే అనేక లాభాలు కలుగుతాయి. అనేక రకాల పోషకాలను పొందవచ్చు. ఇవి మనల్ని రోగాల నుంచి రక్షిస్తాయి.
పూర్వం చాలా మంది జొన్న పిండితో రొట్టెలను తయారు చేసే తినేవారు. కానీ ఇప్పుడు ఇలా తినడం తగ్గించేశారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న కొందరు మాత్రం ప్రస్తుతం జొన్న రొట్టెలను తింటున్నారు. జొన్నలను పిండిగా మార్చి వాటితో రొట్టెలను తయారు చేసి రోజూ తింటే అనేక లాభాలు కలుగుతాయి. షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే బరువు తగ్గేందుకు కూడా సహాయం చేస్తాయి. జొన్నల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా జొన్న రొట్టెలతో లాభాలను పొందవచ్చు.
ఇక రాగులతోనూ రొట్టెలను తయారు చేసి తినవచ్చు. రాగి పిండితో వీటిని తయారు చేస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. రాగి రొట్టెలను తినడం వల్ల క్యాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. రాగి రొట్టెలను తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. మనల్ని యాక్టివ్గా ఉండేలా చేస్తాయి. ఉత్సాహంగా ఉంటాము. చురుగ్గా పనిచేస్తాము. నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. రాగుల్లో ఉండే మెగ్నిషియం కారణంగా కండరాలు ప్రశాంతంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. అలాగే రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా రాగి రొట్టెలతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఇక రాత్రి పూట తినాల్సిన రొట్టెల్లో సజ్జ రొట్టెలు కూడా ఒకటి. సజ్జలను పిండి మార్చి దాంతో రొట్టెలను తయారు చేయవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అనేక లాభాలను అందిస్తాయి. షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నవారు ఇతర రొట్టెల కన్నా సజ్జ రొట్టెలను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. సజ్జల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా వీటిల్లో ఫైబర్ ఉంటుంది. కనుక ఈ రొట్టెలను తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక సజ్జల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఈ రొట్టెలను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఈ విధంగా సజ్జ రొట్టెలు మనకు మేలు చేస్తాయి. ఇలా రోజూ కేవలం గోధుమ పిండితో చేసే చపాతీలను మాత్రమే కాకుండా, రోజుకో రకం రొట్టెలను తింటుండాలి. దీంతో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.