న్యూఢిల్లీ : శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తూ అది సరైన రీతిలో పనిచేసేందుకు విటమిన్లు, మినరల్స్‌తో పాటు ప్రొటీన్ చాలా కీలకం. మాంసాహారానికి దూరంగా ఉండే శాకాహారుల్లో (Health Tips) బీ12, విటమిన్ డీ లోపాలతో పాటు ప్రొటీన్ల లోపం తరచూ కనిపిస్తుంటుంది. ప్రొటీన్ లోపాలను అధిగమించేందుకు శాకాహారంలో కూడా మెరుగైన ఆహార పదార్ధాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ప్లాంట్ ఆధారిత ఆహారం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందడంతో పాటు ఆరోగ్యకర జీవన శైలిని సొంతం చేసుకోవచ్చు. సమతుల శాకాహారంతో హృద్రోగాలు, టైప్ 2 మధుమేహం, స్ధూల కాయం ముప్పును తగ్గించుకోవచ్చని తాజా పరిశోధనలో వెల్లడైంది. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా శాకాహారంలోనూ పుష్కలంగా ప్రొటీన్లను పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పప్పు ధాన్యాల్లో ప్రొటీన్, ఫైబర్, కీలక పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని సూప్స్, సలాడ్స్, కూరల రూపంలో తీసుకోవచ్చు.
Read More