సోషల్ మీడియా వైద్యం మంచిదేనా?
మనకు తెలియని ఎన్నో అంశాలు ఇప్పటి కాలపు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇదే నవీన ఆయుర్వేదం. ప్రముఖ దినపత్రికలు, చానెల్స్ ఈ నవీన ఆయుర్వేదంపై అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. అయితే, సామాజిక మాధ్యమాలు ఊపందుకోవడంతో కొత్త చిక్కు వచ్చిపడింది. వాటిలో అనేక రకాల చికిత్సలపై షార్ట్స్, రీల్స్ రూపంలో పుంఖానుపుంఖాలుగా సమాచారం లభిస్తున్నది.
మనకు తెలియని ఎన్నో అంశాలు ఇప్పటి కాలపు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇదే నవీన ఆయుర్వేదం. ప్రముఖ దినపత్రికలు, చానెల్స్ ఈ నవీన ఆయుర్వేదంపై అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. అయితే, సామాజిక మాధ్యమాలు ఊపందుకోవడంతో కొత్త చిక్కు వచ్చిపడింది. వాటిలో అనేక రకాల చికిత్సలపై షార్ట్స్, రీల్స్ రూపంలో పుంఖానుపుంఖాలుగా సమాచారం లభిస్తున్నది. పసరు వైద్యాలు, గోసాయి చిటాలు, నాటు వైద్యాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒక చిన్న గాజు సీసాను అటక మీద నుంచి కిందికి దించేటప్పుడు హ్యాండిల్ విత్ కేర్ అని అంటారు. కానీ, రకరకాల ఆయుర్వేద మూలికలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ విషయంలో జాగ్రత్త సుమా! అని ఏ ఒకరూ చెప్పకపోవడం విడ్డూరం.
వంటింట్లో ఉండే అల్లం, వెల్లుల్లి, మిరియాలు లాంటి వేడితత్వం కలిగిన పదార్థాలు పెప్టిక్ అల్సర్, డియోడినల్ అల్సర్, బ్లీడింగ్ పైల్స్ కలిగిన వారికి రక్తస్రావం కలగజేసే పరిస్థితి తలెత్తుతుంది. ఎంతో సుతారంగా ఆ యూట్యూబ్ వైద్య శిఖామణులు ఓ రెండాకులు నమిలితే జబ్బు తగ్గిపోతుందని చెబుతారు. ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఎవరో చెప్పారని ఇటీవల ఉమ్మెత్త ఆకులు వండుకుని తింటే ప్రాణాపాయ పరిస్థితిలో పడిపోయారు. ప్రతి దానికి, ప్రతి విషయంలో అనుభవజ్ఞులు ఉంటారు. వైద్యంలో కూడా అలాంటి వారి మాటలే వినాలి.
పసరు మందు ఇచ్చే నాటువైద్యులను ఆయుర్వేద వైద్యులనడం సరికాదు. ఆయుర్వేద వైద్యులు ఓ పుషరకాలం శాస్త్రం చదువుకుంటారు. లబ్ధ ప్రతిష్ఠులైన ఆయుర్వేద వైద్యులు మన మధ్య ఉన్నారు. ఎవరు ఏవేమి చికిత్సలు చేస్తారు? ఇందులో వారి హస్తవాసి గురించిన విషయాలపై జన సామాన్యంలో అవగాహన లేదనే చెప్పుకోవాలి. ప్రజలు ఆలకించే స్వభావం ఉంటే అలాంటి వైద్యులు ఎవరో, వారి అనుభవం ఏమిటో మనకు అర్థం అవుతుంది.
చికిత్స సంగతి కాసేపు పక్కన పెడదాం.. అసలు రోగాలు రాకుండా ఉండాలంటే మనం ఎలా జీవించాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలా నడుచుకోవాలి? ఎలా ఆలోచించాలి? మన నిద్ర ఎలా ఉండాలి? రుతువులు ఏమిటి? వాటి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది? మన శరీరతత్వం ఏమిటి? దాన్ని అనుసరించి శరీరంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఏమేమి చేయాలి? శరీరంలో పేరుకుపోయిన సెల్యూలార్ మెటబాలిక్ వేస్ట్ (మలాలు) ఎలా తగ్గించుకోవాలి? గట్ హెల్త్ ఎలా ఉండాలి? మధుమేహం, హైపర్ టెన్షన్ , కీళ్లవాతం, సంధి రోగాలు, పక్షవాతం, ఎముకలు గుల్ల భారడం తదితర రుగ్మతలు రాకుండా జీవనశైలి ఎలా ఉండాలి? తదితర అంశాలను మీ చెంతకు చేర్చే వేదిక ఇది. ప్రజలకు ఆరోగ్యకరమైన వైద్య అవకాశాన్ని అందించాలన్నదే మా ఆకాంక్ష!
డాక్టర్ బుక్కా మహేశ్‌బాబు
ఆయుర్వేద వైద్య నిపుణులు
70328 03085
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

