పండుగవేళ వసూళ్ల బాగోతం..!
ఫిల్మ్‌నగర్‌లో పోలీసుల బెదిరింపుల పర్వం మరవకముందే ఖాకీల మరో బెదిరింపుల వ్యవహారం వెలుగు చూసింది.
- ముగ్గురు ఖాకీలపై బెదిరింపుల కేసు..
సిటీబ్యూరో, నవంబర్ 9 ( నమస్తే తెలంగాణ): ఫిల్మ్‌నగర్‌లో పోలీసుల బెదిరింపుల పర్వం మరవకముందే ఖాకీల మరో బెదిరింపుల వ్యవహారం వెలుగు చూసింది. సామాన్యుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలతో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డుపై ఎక్స్టార్షన్ కేసు నమోదైంది.వివరాల్లోకి వెళ్తే సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు ఓ వాహనదారుడితో గొడవకు దిగారు.ఈ క్రమంలో అతనితో పాటు బైక్‌ను కూడా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన బాధితుడు తన వాహనాన్ని తనకు తిరిగి ఇవ్వాలని బతిమలాడాడు. కానీ బైక్ ఇవ్వాలంటే రూ.2వేలు ఇవ్వాలని ముగ్గురు పోలీసులు డిమాండ్ చేసినట్లు బాధితుడు చెప్పాడు.
దీంతో బాధితుడు రూ.1000 ఇస్తానని చెప్పి ఆ మొత్తాన్ని వారికి ఇచ్చి తన బైకును తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులకు తాను లంచం ఇచ్చి బయటపడ్డానంటూ బాధితుడు ఈ ఘటనను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో విషయం బయటకు వచ్చింది. హరికృష్ణ అనే వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోలీసులతో తనకు జరిగిన వివాదాన్ని, తాను డబ్బులు ఇచ్చిన వైనాన్ని చెబుతూ వీడియో చేసి పోస్టు చేశారు.
ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతనిని పిలిచి వివరాలు సేకరించారు. అతని నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకున్న తర్వాత సోమవారం సనత్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు హోంగార్డుపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

