అండాల రాకెట్ వెనుక ‘రాజకీయ పెద్దలు’ ఎవరు?
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అండాల అక్ర మ సేకరణ(ఊసైట్ రాకెట్) దందాపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తీవ్రస్థాయిలో స్పందించారు. ఇంత ఘోరం జరుగుతున్నా వాస్తవాలను బయటపెట్టకుండా కప్పిపుచ్చే ధోరణిని అవలంబిస్తున్న పోలీసు, వైద్యారోగ్య శాఖల తీరుపై ధ్వజమెత్తారు.
- ప్రధాన నిందితుడు డాక్టర్ హుస్సేన్ ఎవరి మనిషి?
- అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
- అక్రమ దందాపై ప్రభుత్వ వైఖరిని నిలదీసిన రాష్ట్ర మహిళా కమిషన్
- పోలీసుల, వైద్యాధికారుల ఉదాసీనతపై ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అండాల అక్ర మ సేకరణ(ఊసైట్ రాకెట్) దందాపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తీవ్రస్థాయిలో స్పందించారు. ఇంత ఘోరం జరుగుతున్నా వాస్తవాలను బయటపెట్టకుండా కప్పిపుచ్చే ధోరణిని అవలంబిస్తున్న పోలీసు, వైద్యారోగ్య శాఖల తీరుపై ధ్వజమెత్తారు. అధికారులు సమగ్ర సమాచారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని, మహిళా కమిషన్‌కు వివరాలు ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని సూటిగా నిలదీశారు. అక్రమ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ హుస్సేన్ పాత్రపై కీలక ప్రశ్నలు సంధించారు.
అసలు డాక్టర్ హుస్సేన్ ఎవరి మనిషి? ఆయన వెనుక ఉన్న రాజకీయ పెద్దలెవరు? ఎవరి అం డదండలతో, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.ఈ అక్రమ దందాపై మ హిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి సోమవారం విసృ్తతస్థాయి విచారణ చేపట్టింది. ఆరోపణలు ఎదురొంటున్న ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు ఇప్పటికే మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. సంబంధిత ఐదు ఫెర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులు కమిషన్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. తమ దవాఖానల్లో జరిగిన అండాల సేకరణ విధానం, రోగుల కేస్ షీట్లు, ఇతర సాంకేతిక సమాచారాన్ని అధికారులకు సమర్పించారు. నిర్వాహకులు అందజేసిన నివేదికలతో పాటు ఆయా ఫెర్టిలిటీ కేంద్రాలకు సంబంధించిన రికార్డులను మహిళా కమిషన్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ప్రధాన నిందితుడు ఎవరు?
ఇంతటి ఘోరానికి పాల్పడిన ప్రధాన నిందితుడి పేరును, ఆచూకీని దాచిపెట్టాల్సిన అవసరం అధికారులకు ఏమొచ్చిందంటూ నేరెళ్ల శారద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన కొందరు క్షేత్రస్థాయి ఏజెంట్లపై నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం ద్వారా కేసును ముగించే కుట్ర జరుగుతున్నదని మండిపడ్డారు. బాధితులు స్వయంగా తమ వాంగ్మూలాల్లో డాక్టర్ హుస్సేన్‌తో పాటు ఇందిర ఐవీఎఫ్, నర్మద, ఒయాసిస్, సద్గురు ఏఆర్టీ, పద్మజ వంటి ప్రముఖ కార్పొరేట్ ఫెర్టిలిటీ సెంటర్ల పేర్లను స్పష్టంగా చెప్పినప్పటికీ, ఇప్పటివరకు వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని అధికారులను నిలదీశారు.
ఈ దందా తీగ లాగితే బయటపడుతున్న నిజాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయని కమిషన్ పేరొన్నది. దాదాపు ఆరు రాష్ట్రాలకు చెందిన అమాయక నిరుపేద యువతులను ఉద్యోగాల పేరుతో నగరానికి రప్పించి, వారి ఆధార్, గుర్తింపు కార్డులను ఫోర్జరీ చేసి అక్రమంగా ఫెర్టిలిటీ కేంద్రాలకు తరలించారని విచారణలో తేలింది. మహిళల శారీరక సామర్థ్యాన్ని పట్టించుకోకుండా బలవంతంగా, పదేపదే అండాలను సేకరించడంతో ఎంతోమంది యువతులు ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత మహిళల జీవితాలు, ఆరోగ్యం నాశనమవుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం క్షమించరాని నేరమని హెచ్చరించారు. మహిళల శారీరక స్వేచ్ఛ, గౌరవం, ప్రాణాలతో చెలగాటమాడుతూ కోట్లు గడిస్తున్న ఈ అక్రమ వ్యాపారంలో సూత్రధారులు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా, ఎంత పెద్ద నేతల అండ ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని శారద స్పష్టంచేశారు. ఒత్తిళ్లకు తలొగ్గి నేరస్తులను తప్పించే ప్రయత్నం చేస్తే తీవ్ర చట్టపరమైన పరిణామాలు ఉంటాయని వైద్య, పోలీసు ఉన్నతాధికారులను కమిషన్ హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

