Milk For Weight Loss | మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పాలను తాగితే మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. కనుకనే పాలను రోజూ తాగాలని సూచిస్తుంటారు. పాలలో అనేక పోషకాలు ఉంటాయి. రోజూ పాలను తాగడం వల్ల మన శరీరానికి కావల్సిన అన్ని పోషకాలను పొందవచ్చు. పాలలో ప్రోటీన్లు కూడా అధిక మొత్తంలోనే ఉంటాయి. ఒక కప్పు పాలను తాగడం వల్ల సుమారుగా 8 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. ప్రోటీన్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. ఉత్సాహంగా, చురుగ్గా ఉండేలా చేస్తాయి. నీరసం, అలసటను తగ్గిస్తాయి. బద్దకం పోయేలా చేస్తాయి. కనుక పాలను రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసిన వారు పాలను తాగితే శక్తి లభిస్తుంది. దీంతో మళ్లీ ఉత్సాహంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. కండరాలు మరమ్మత్తులకు గురవుతాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలను ఉదయం పూట తాగితే రోజంతా శక్తి స్థాయిలు శరీరంలో అధికంగా ఉంటాయి. దీంతో నీరసం, అలసట రావు. యాక్టివ్గా ఉంటారు. అలాగే పాలను ఉదయం తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇలా బరువు తగ్గడం తేలికవుతుంది. కనుక పాలను తాగితే బరువు తగ్గుతారనే చెప్పవచ్చు. ఇక పాలను తాగితే మన శరీరంలో జీఎల్పీ-1, పీవైవై, సీసీకే వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. దీని వల్ల మనం ఆహారం తక్కువగా తింటాం. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. కనుక బరువు తగ్గాలని చూస్తున్నవారు పాలను ఉదయం తాగితే మేలు జరుగుతుంది.
పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగాలి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది. పాలలో ట్రిప్టోఫాన్, మెగ్నిషియం, మెలటోనిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి నిద్ర చక్కగా పట్టేలా చేస్తాయి. మైండ్ రిలాక్స్ అయ్యేలా చూస్తాయి. దీంతో నిద్ర త్వరగా పడుతుంది. రోజూ పాలను తాగుతుంటే నిద్రలేమిని తగ్గించుకోవచ్చు. అలాగే మానసిక ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది. పాలను రాత్రి పూట సేవించడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో రాత్రి పూట మీరు నిద్రిస్తున్నా కూడా మీ శరీరం క్యాలరీలను ఖర్చుచేస్తుంది. దీంతో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఇలా బరువు తగ్గేందుకు పాలు ఎంతో దోహదం చేస్తాయి.
పాలలో క్యాల్షియం, విటమిన్ డి, లినోలినిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. పాలను ఉదయం తాగడం వల్ల కండరాలు నిర్మాణమవుతాయి. కండరాలు మరమ్మత్తులకు గురవుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. రోజంతా యాక్టివ్గా పనిచేయవచ్చు. పాలను రాత్రి పూట సేవిస్తే బరువు తగ్గడంతోపాటు నిద్ర సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే రాత్రి పూట పాలను తాగేవారు కొవ్వు తీసిన పాలను తాగాలి. లేదంటే శరీరంలో కొవ్వు చేరుతుంది. పాలను రాత్రిపూట సేవిస్తే అందులో తేనె, మిరియాల పొడి, పసుపు వంటివి కలిపి తాగితే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. ఇలా పాలను రోజులో వివిధ సమయాల్లో తాగడం వల్ల భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.