ఈ కాలంలో ఎవరికి ఆకలి వేసినా మైక్రోవేవ్ ఓవెన్ వైపు చూస్తున్నారు. అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను వేడి చేసుకుంటూ తింటున్నారు. మైక్రోవేవ్ వల్ల తక్షణమే ఆహారం వేడివేడిగా అందుతుండడంతో అందరూ అటువైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రతి వంటగదిలో ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ తప్పనిసరి వస్తువు అయిపోయింది. అయితే, ఇలా ఆహారాన్ని వేడిచేసి తింటూ ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైక్రోవేవ్ ఓవెన్ ఎందుకు వాడకూడదో తెలిపే ఐదు కారణాలు చెబుతున్నారు.
1. పోషకాలు నశిస్తాయి..
ఆహార పదార్థాలను మైక్రోవేవ్ ఓవెన్ వేడిచేస్తే వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, అవసరమైన పోషకాలు నశించిపోతాయి. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందకుండా పోతాయి.
2. రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం..
మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేసిన ఆహారాన్ని తింటే రక్తంలో సీరం స్థాయిలు, శోషరస గ్రంథులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. దీంతో అనారోగ్యం పాలయ్యే ప్రమాదముంది.
3. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది..
కూరలు, కూరగాయలను మైక్రోవేవ్ ఓవెన్లో వేడిచేస్తే శరీరానికి అవసరమైన ఖనిజాలు ఫ్రీ రాడికల్స్గా మారుస్తాయి, ఇది శరీరంలో క్యాన్సర్ కార్యకలాపాలకు దారితీస్తుంది. మైక్రోవేవ్లో కూరగాయలను వేడిచేయడం మానుకుంటే మంచిది. ఇది శరీరంపై తీవ్రమైన ప్రతికూలతలను కలిగి ఉంటుంది.
4. శరీరాభివృద్ధిపై తీవ్ర ప్రభావం..
మైక్రోవేవ్ ఓవెన్లో వేడిచేసిన ఆహారాన్ని రోజూ తినడం వల్ల దీర్ఘకాలిక, శాశ్వత మెదడు సంబంధ వ్యాధులు వస్తాయి. మెదడు పూర్తిగా దెబ్బతింటుంది. పురుషులు, స్త్రీలలో హార్మోన్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.
5. శరీరానికి పెద్దగా ప్రయోజనం ఉండదు..
ఆరోగ్యకరమైన ఆహారాన్ని మైక్రోవేవ్ ఓవెన్లో వేడిచేసి తింటే శరీరానికి పెద్ద ప్రయోజనం ఉండదు. ఇవి మరింత హాని కలిగిస్తాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని గ్యాస్పైన వేడిచేసేందుకే ప్రయత్నించండి. ఇలాచేస్తే మిగిలిపోయిన ఆహార పదార్థాల్లోనూ పోషక విలువలు కోల్పోవు. శరీరానికి పెద్దగా హాని జరుగదు.