Skin Cancer | వీరిలో చర్మ క్యాన్సర్ ముప్పు అధికం.. అధ్యయనంలో సంచలన విషయాలు
కెనడా, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్ (Skin Cancer) కేసులు పెరుగుతున్న క్రమంలో మెక్‌గిల్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
న్యూయార్క్ : కెనడా, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్ (Skin Cancer) కేసులు పెరుగుతున్న క్రమంలో మెక్‌గిల్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది. పురుషులు, సంపన్న వర్గాల వారు అధికంగా చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఈ స్టడీలో తేలింది. అల్ట్రా వయలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం, వివిధ వర్గాల వారి స్వభావాలను అంచనా వేసిన అనంతరం ఈ విషయాలను వెల్లడించింది. ఆదాయం, విద్య, జెండర్ వంటి పలు అంశాల ఆధారంగా పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు.
అధికాదాయం కలిగిన వ్యక్తులు, పురుషులు ఎక్కువగా చర్మ క్యాన్సర్ మెలనోమా బారినపడుతున్నారని పేర్కొంది. అధికాదాయం కలిగిన వ్యక్తులు మెలనోమా ముప్పును అధికంగా ఎదుర్కొంటున్నారని అధ్యయనం వెల్లడించింది. వీరు జీవితంలో అధిక సమయం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడంతో పాటు మురికితో కూడిన బెడ్లపై ఎక్కువ సమయం గడపడమే కారణమని పేర్కొంది. మహిళలతో పోలిస్తే పురుషులు సన్ ప్రొటెక్షన్‌కు ఎలాంటి కేర్ తీసుకోకపోవడమూ ఓ కారణమని అధ్యయనం తెలిపింది.
సంపన్న వర్గాలు ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అయ్యేలా విహార యాత్రలకు తరచూ వెళుతుంటారని రిక్రియేషనల్ ట్యానింగ్‌కు గురవుతుంటారని ఇది వారిలో మెలనోమాకు దారితీస్తుందని మెక్‌గిల్ వర్సిటీలో డెర్మటాలజీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇవన్ లిట్వినవ్ చెప్పారు. మరోవైపు ఏడాదికి 50,000 డాలర్లలోపు సంపాదించే వారు అధికంగా అవుట్‌డోర్స్‌లో పనిచేస్తూ వృత్తిపరంగా ఎండలో అధికసమయం వెచ్చించాల్సి రావడంతో వారిలో చర్మ క్యాన్సర్ తలెత్తే ముప్పు అధికంగా ఉందని అధ్యయనం వెల్లడించింది.
బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు చేపట్టడం ద్వారా మెలనోమా ముప్పును తగ్గించవచ్చని పరిశోధకులు సూచించారు. చర్మ క్యాన్సర్‌ను నిరోధించాలంటే సన్‌స్క్రీన్ లోషన్స్ వాడటం సమర్ధవంతమైన నియంత్రణ చర్యల్లో ఒకటని డాక్టర్ లిట్వినవ్ చెబుతున్నారు. చర్మ క్యాన్సర్‌ను తగ్గించేందుకు ప్రజారోగ్య విధానాలు రూపొందించడంలో నిర్ధిష్ట వర్గాల ఆధారంగా నిర్ధిష్ట విధానాలను అనుసరించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మెలనోమా కేసులు పెరుగుతున్న క్రమంలో దీన్ని నిరోధించేందుకు ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.
Read More :
Great Wall of China | అమ్మ బాబోయ్! షార్ట్‌కట్‌లో వెళ్లొచ్చని గ్రేట్‌వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

