Great Wall of China | అమ్మ బాబోయ్! షార్ట్‌కట్‌లో వెళ్లొచ్చని గ్రేట్‌వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు!
Great Wall of China | వాళ్లందరికంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిన ఓ జంట మాత్రం.. తొందరగా వెళ్లేందుకు ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చారిత్రక కట్టడాన్నే కూల్చేసింది. తమ వాహనాలు వెళ్లేందుకు కావాల్సినంత వెడల్పుగా గోడను తవ్వేసింది. చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లోని యుయు కౌంటీ వద్ద యాంగ్కాన్హె టౌన్షిప్ వద్ద జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Great Wall of China | రోడ్లపై వెళ్లేటప్పుడు షార్ట్‌కట్ కోసమని చాలామంది డివైడర్లను తవ్వేస్తుంటారు! కాల్వలు ఏమైనా ఉంటే పూడ్చేస్తుంటారు! అంత దూరం ఎవరు తిరిగొస్తారని అనుకుంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇలా డివైడర్లను తవ్వేసి షార్ట్కట్లు క్రియేట్ చేసే ఘనులు మనకు చాలా చోట్లలో కనిపిస్తుంటారు. అలాంటి వాళ్లందరికంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిన ఓ జంట మాత్రం.. తొందరగా వెళ్లేందుకు ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చారిత్రక కట్టడాన్నే కూల్చేసింది. తమ వాహనాలు వెళ్లేందుకు కావాల్సినంత వెడల్పుగా గోడను తవ్వేసింది. చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లోని యుయు కౌంటీ వద్ద యాంగ్కాన్హె టౌన్షిప్ వద్ద జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

యుయు కౌంటీ వద్ద ఉన్న గ్రేట్‌వాల్ ఆఫ్ చైనాను 32 గ్రేట్‌వాల్ అని పిలుస్తుంటారు. దీనికి సమీపంలో ఓ కన్స్ట్రక్షన్కు సంబంధించిన కాంట్రాక్టును ఇద్దరు వ్యక్తులు తీసుకున్నారు. వారిలో 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ ఉన్నారు. అయితే వారు ఉండే ప్రదేశానికి, కాంట్రాక్ట్ తీసుకున్న ప్రదేశానికి మధ్యలో 32 గ్రేట్‌వాల్ ఉంటుంది. దీంతో చాలా కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. రోజూ యంత్రాలను, సామగ్రిని తీసుకుని అంత దూరం తిరిగి వెళ్తుంటే బోలెడంత సమయం, చాలా డబ్బులు ఖర్చవుతున్నాయని వాళ్లు భావించారు. ఇంకేముంది అడ్డుగా ఉన్న గ్రేట్‌వాల్‌ను కాస్త కూల్చేస్తే తమకు ఎంతో లాభం జరుగుతుందని అనుకున్నారు.

ఇంకేముంది గ్రేట్‌వాల్‌కు ఏర్పడిన చిన్న సందిని గమనించి దాన్ని మొత్తం తవ్వేశారు. తమ వాహనాలు వెళ్లేందుకు కావాల్సినంత వెడల్పుగా గోడను చెక్కేశారు. తాము వెళ్లేందుకు ఒక షార్ట్‌కట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఎంచక్కా ఆ షార్ట్‌కట్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు ఆగస్టు 24వ తేదీన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చైనా సమగ్రతకు, ప్రతిష్టకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మకమైన గోడను కూల్చేయడం చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు. కేవలం షార్ట్‌కట్‌గా ఉపయోగపడుతుందని ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా నిలిచిన కట్టడం కూల్చేయడమేంటని సీరియస్ అయ్యారు. నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణాన్ని క్రీ.పూ.200 సంవత్సరంలో మింగ్ వంశస్తులు ప్రారంభించారు. అయితే క్రీ.శ.1600 వచ్చేసరికి దీని నిర్మాణం పూర్తయ్యిందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ గోడను 1987లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

