పెరినేటల్.. ప్రసూతి వైరాగ్యం
‘ప్రసూతి వైరాగ్యం’ అని పెద్దలు ఊరికే అనలేదు. ప్రసవ సమయంలో శరీరంలో వచ్చే హార్మోన్ మార్పులు బాలింత మానసిక ఆరోగ్యం మీద తప్పక ప్రభావం చూపిస్తాయి.
‘ప్రసూతి వైరాగ్యం’ అని పెద్దలు ఊరికే అనలేదు. ప్రసవ సమయంలో శరీరంలో వచ్చే హార్మోన్ మార్పులు బాలింత మానసిక ఆరోగ్యం మీద తప్పక ప్రభావం చూపిస్తాయి. కుంగుబాటును కలిగిస్తాయి. ఆత్మహత్య ఆలోచనలకు దారితీయవచ్చు. ఈ విషయాన్నే కొన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. గర్భం దాల్చిన దగ్గర్నుంచి ప్రసవమైన ఏడాది వరకు.. ఉన్న కాలాన్ని వైద్య పరిభాషలో ‘పెరినేటల్’ అంటారు. ఈ సమయంలో డిప్రెషన్‌కు లోనయ్యేవారిని లోతుగా గమనించాలనుకున్నారు స్వీడిష్ పరిశోధకులు.
ఆశ్చర్యంగా పెరినేటల్ సమయంలో డిప్రెషన్‌కు గురైనవారిలో, ఆత్మహత్య ఆలోచన ఆరురెట్లు బలంగా కనిపించింది. మానసిక సమతౌల్యం లేకపోవడం, పరధ్యానంలో ప్రమాదాలకు గురికావడం తదితర లక్షణాలు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. పెరినేటల్ డిప్రెషన్‌కు గురైనవారి మానసిక స్థితి చాలా ఏళ్ల తర్వాత కూడా అంతే సున్నితంగా ఉన్నట్టు తేలింది. కాబట్టి, గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత కుంగుబాటు లక్షణాలు కనిపిస్తే తప్పకుండా మానసిక వైద్యుడిని సంప్రదించాలి. ఆ తర్వాత కూడా మనోస్థితిని గమనించుకుంటూ అవసరమైన చికిత్స తీసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

