Foxtail Millets | ఈ ఉరుకుల పరుగుల బిజీ యుగంలో నిన్న మొన్నటి వరకు చాలా మంది జంక్ ఫుడ్‌కు బాగా అలవాటు పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారు. కానీ ప్రస్తుతం చాలా మందికి ఆరోగ్యం పట్ల ఇప్పుడు శ్రద్ధ పెరుగుతోంది. అందులో భాగంగానే ఆహారం, వ్యాయామం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తినడంతోపాటు వ్యాయామం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మందికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరిగింది. అయితే ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది అనేక ఆహారాలను తింటున్నారు కానీ మిల్లెట్లకు అంతగా ప్రాధాన్యాత ఇవ్వడం లేదు. మన పూర్వీకులు ఎక్కువగా వాటినే తినేవారు. కానీ ప్రస్తుతం కేవలం కొంత మంది మాత్రమే మిల్లెట్లను తింటున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మిల్లెట్లను కచ్చితంగా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొర్రలను రోజూ తినాలని వారు చెబుతున్నారు.
కొర్రలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పురాతన కాలం నుంచి మానవునికి ఆహారంగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొర్రలను రోజూ తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు. కొర్రలతో జావ, ఉప్మా, అన్నం, రొట్టె వంటివి తయారు చేసి తినవచ్చు. కొర్రలను రోజూ తినడం వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు. కొర్రలు షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చాలా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువను కలిగి ఉంటాయి. పైగా వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి కొర్రల వల్ల మేలు జరుగుతుంది. వీటిని రోజూ తింటుంటే ఉపయోగం ఉంటుంది. కొర్రలను తినడం వల్ల ఫైబర్ అధికంగా లభిస్తుంది కనుక జీర్ణ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది.
కొర్రలు ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. కనుక వీటిని తింటుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కొర్రలను తినడం వల్ల ఫైబర్ అధికంగా లభించి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటుంటే బీపీని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవచ్చు. కొర్రల్లో ఉండే పొటాషియం రక్త నాళాలను సైతం ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని రోజూ తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. కొర్రల్లో అధికంగా ఉండే మెగ్నిషియం కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి.
కొర్రలను తినడం వల్ల ఫాస్ఫరస్ అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే వీటిల్లో ఉండే కాపర్ శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల యాక్టివ్‌గా మారుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. కొర్రలను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఇలా కొర్రలను తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ తినడం మరిచిపోకండి.