World Zoonoses Day | కామారెడ్డి(నమస్తే తెలంగాణ)/ఎల్లారెడ్డి రూరల్, జూలై 5: మనిషికి అనాదిగా జంతువులతో అవినాభావ సంబంధం ఉన్నది. వాటితో సాన్నిహిత్యం కూడా ఎక్కువగానే ఉంది. మనిషి తన జీవనోపాధికి పశువుల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వాటిని పోషించడంతోపాటు వృత్తిగా చేసుకొని జీవిస్తున్నారు. ఆ జంతువుల నుంచి మనుషులకు రోగా లు వస్తున్నాయి. ఇలా సహజ సిద్ధంగా సంక్రమించే వాటిని జూనోసిస్ వ్యాధులు అంటారని, ఇలాంటి జూనోటిక్ వ్యాధులు దాదాపు 200 వరకు ఉన్నాయని, ఆ వ్యా ధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఎల్లారెడ్డి మం డల పశు వైద్యాధికారిణి అర్చన చెబుతున్నారు. పందు ల నుంచి సంక్రమించే స్వైన్ ఫ్లూ, పశువుల నుంచి సోకే ఆంత్రాక్స్, కుక్కల నుంచి వ్యాపించే రెబీస్ వ్యాధులు ఈ కోవకు చెందినవే. వీటి బారిన పడితే ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. 1885 జూలై 6వ తేదీన లూయిపాశ్చర్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా యాంటీ రెబీస్ టీకాను ఉపయోగించి పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. అందుకే ఏటా జూలై 6వ తేదీన “జూనోసిస్ డే” గా పాటిస్తున్నారు.
గాలి, నీరు, ఆహారం, కలుషితమైన మాంసం, పాలు, గుడ్లు, బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవుల ద్వారా అలాగే పశు ఉత్పత్తుల నుంచి జునోటిక్ వ్యాధులు మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతున్నట్లు సమాచారం. స్వైన్ ఫ్లూ, ఆంత్రాక్స్ వ్యాధులు అదుపులో ఉన్నా కుక్కలద్వారా రెబీస్, బ్రూసెల్లోసిస్, లిస్టిరియోసిస్, లెప్టోస్పైరోసిస్, హైడాటియాసిస్, ప్లేగు వ్యాధులు వస్తాయి. మెదడువాపు, ప్లేగు వ్యాధులు కూడా జునోటిక్ కోవకు సంబంధించినవే. మెదడువాపు వ్యాధి కారణంగా ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. విచ్చలవిడిగా తిరిగే పందుల శరీరంపై దోమలు కాటువేయడంతో ఈ వ్యాధి వ్యాపిస్తున్నది. ఇక బ్యాక్టీరియా ద్వారా సాల్మోసెల్లోసిస్, లెఫ్టోస్పైరోసిస్, గ్లాండర్స్ వ్యాధులు సంక్రమిస్తాయి. పరాన్నజీవుల కారణంగా అంకైలోస్టోమియాసిస్, హైడాటియాసిస్, అలర్జీ, గజ్జి, అమీబియాసిస్, బాలాంటిడియాసిస్, టాక్సోప్లాస్మా వ్యాధులు సోకుతాయి. పశువుల కారణంగా మశూచి, బ్రూసెల్లోసిస్, టీబీ, రేబిస్, మ్యాడ్ కౌ, గాలికుంటు, పాశ్చరెల్లోసిస్ వ్యాధులు వ్యాపిస్తాయి. మేకల ద్వారా మశూచి, అస్పర్జిల్లస్, రింగ్వార్మ్, తలసేమియా, లిస్టిరియోసిస్ సోకుతాయి. ఎలుకలు ప్లేగు, లెప్టోస్పైరోసిస్, మెదడువాపు, క్యూఫీవర్ వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. కోతుల కారణంగా డెంగీ, అమీబియాసిస్, పైలేరియాసిస్, రేబిస్, సాల్మోనెల్లోసిస్, మీజిల్స్, కైసనూర్ ఫారెస్ట్ వ్యాధులు వస్తాయి.
పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. జూనోసిస్ డేను పురస్కరించుకొని ప్రభుత్వ పశువైద్యశాలల్లో ఉచితంగా టీకాలు వేస్తున్నాం. పశువులు, పెంపుడు జంతువులైన కుక్కలను పశువుల దవాఖానకు తీసుకొచ్చి టీకాలు ఇప్పించాలి.
– అర్చన, మండల పశువైద్యాధికారిణి, ఎల్లారెడ్డి