Male fertility supplements | పెళ్లై అలా ఏడాది గడిచిపోయిందో లేదో.. మనవడు, మనవరాలు అంటూ పోరు అందరి ఇళ్లలో మొదలవడం మనం చూస్తున్నాం. ఏమన్నా విశేషమా? అంటూ అందరూ అడుగుతుంటారు. ఈ మాటలు అటు ఆడవారిని, ఇటు మగవారిని బాధపెడుతుందని తెలిసినా వారు ప్రశ్నించడం మాత్రం ఆపరు. కొన్నిండ్లల్లో పిల్లలు పుట్టకపోతే ఆడవారి తప్పే అన్నట్లుగా దెప్పి పొడుస్తుంటారు. కానీ, పిల్లలు పుట్టకపోవడానికి పురుషులు కూడా కారణమని తెలిసినా పట్టించుకోరు. కొన్ని పరిశోధనల ప్రకారం, మూడింట ఒక వంతు పురుషుల్లో వంధ్యత్వం ఉంటుంది. వంధ్యత్వం అనేది మహిళలకు సంబంధించింది కాదు. అయితే, పురుషుల్లో పునరుత్పత్తి ఆరోగ్య రక్షణకు సంతానోత్పత్తి సప్లిమెంట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.
మగ సంతానోత్పత్తి సప్లిమెంట్లు విటమిన్లు, ఖనిజాలతోపాటు ఆరోగ్యకరమైన శుక్ర కణాల ఉత్పత్తికి సహాయపడే మూలికలు ఉంటాయి. ఈ సప్లిమెంట్లు స్పెర్మ్ మొటిలిటీ, స్వరూపం, సంఖ్య పెరుగుదల, పనితీరు మొదలైన వాటితో సహా కీలకమైన వీర్య కారకాలను పెంచడం ద్వారా సంతానోత్పత్తిని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడతాయి. ఈ పురుష సంతానోత్పత్తి సప్లిమెంట్ల వాడకం వల్ల ఫలితాలు ఉన్నాయని, ఆరోగ్యకరమైన స్పెర్మ్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలను పెంచినట్లు బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని వైద్యనిపుణులు సెలవిస్తున్నారు.
ఇవే ఉత్తమ పురుష సంతానోత్పత్తి సప్లిమెంట్స్..
విటమిన్ సీ
విటమిన్ సీ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది స్పెర్మ్ దెబ్బతినకుండా కాపాడుతుంది. శుక్ర కణాల సంఖ్యను పెంచడంతోపాటు ఇతర స్పెర్మ్ ఆరోగ్య సూచికలను మెరుగయ్యేట్లు చేస్తుంది. విటమిన్ సీ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత కొంతమంది వ్యక్తుల స్పెర్మ్ కౌంట్ రెండు రెట్లు పెరిగినట్లు ఒక అధ్యయనం తేల్చింది. ఇదేసమయంలో బలహీనంగా తయారైన స్పెర్మ్ కణాల సంఖ్య తగ్గింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో స్పెర్మ్ మొటిలిటీలో మెరుగుదల కనిపించింది.
సీఓక్యూ10
స్పెర్మ్ ఆక్సీకరణ ఒత్తిడి, ఇతర రకాల విధ్వంసం నుంచి ఈ ఎంజైమ్ రక్షిస్తుంది. CoQ10 సెమినల్ ఫ్లూయిడ్‌లో ఉండి.. పెద్ద స్థాయిలు పెరిగిన స్పెర్మ్ మొటిలిటీ, శుక్రకణాల సంఖ్యతో సంబంధం కలిగి ఉంటుంది. CoQ10 సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల వీర్యంలోని విటమిన్ మొత్తాన్ని పెరిగేలా చేసి సంతానోత్పత్తిని పెంచుతుందని ఇటీవలి అధ్యయనం తెలిపింది.
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ల స్థాయిలు – ఆరోగ్యకరమైన పురుష పునరుత్పత్తి మధ్య బలమైన సహసంబంధాన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవి స్పెర్మ్ కణాలతో పాటు అనేక రకాల కణాలకు సరైన నిర్మాణాన్ని అందిస్తాయి. సముద్ర ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పొందవచ్చు.
లైకోపీన్
లైకోపీన్ సహజమైన టొమాటో రంగుగా ప్రసిద్ధి చెందినప్పటికీ, దీనితో అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ క్రిమ్సన్ రసాయనం స్పెర్మ్ సంఖ్యను 70 శాతం వరకు పెంచవచ్చు. స్పెర్మ్ మొటిలిటీతో పాటు సంఖ్యను పెంచుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. స్పెర్మ్ కౌంట్‌తోపాటు సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడేందుకు ఎక్కువ మొత్తంలో టమాటలు తీసుకోవాలి. లేదా లైకోపీన్ కలిగిన సప్లిమెంట్‌ను చేర్చుకోవాలి.
విటమిన్ బీ 12
విటమిన్ బీ 12 శుక్రకణాల తయారీ ప్రక్రియకు ఎంతో అవసరమైనది. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కౌంట్‌ను ప్రోత్సహించడంలో విటమిన్ బీ 12 సప్లిమెంటేషన్ యాంటీ ఆక్సిడెంట్లతో సమానంగా సమర్ధవంతంగా ఉంటుందని అధ్యయనాలు చూపాయి.
చివరగా..
పురుషుల్లో వంధ్యత్వం రావడానికి ముఖ్య కారణాల్లో వెరికోసెల్ ఇన్ఫెక్షన్లు, హైడ్రోసిల్, హార్మోన్ల సమస్యలతోపాటు జీవనశైలికి సంబంధించిన అలవాట్లు, పర్యావరణం కూడా ఉన్నాయి. అయితే, ఏదైనా సప్లిమెంట్లను తీసుకోవడానికి ముందు వైద్యనిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం చాలా అవసరం.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.