Samson – Ishan : టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేసిన సంజూ శాంసన్(Sanju Samson), ఇషాన్ కిషన్(Ishan Kishan)లు ఆల్‌టౌమ్ రికార్డును అధిగమించారు. వాంఖడే స్టేడియంలో బౌండరీల మోతతో అలరించిన ఈ ద్వయం.. రెండో వికెట్‌కు 97 రన్స్ రాబట్టింది. తద్వారా పొట్టి కప్ తొలి సీజన్(2007 )లో రాబిన్ ఊతప్ప, యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది.
ఐసీసీ తొలిసారి నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పలు రికార్డులు నెలకొల్పింది. వాటిలో.. యువరాజ్ సింగ్ ఓకే ఓవర్లో ఆరు సిక్సర్లతో చరిత్ర సృష్టించగా.. అత్యధిక భాగస్వామ్యంతో రాబిన్ ఊతప్ప, యూవీలో మరో రికార్డు సాధించారు. పొట్టి వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచులో ఆస్ట్రేలియాపై ఇద్దరూ కలిసి 84 రన్స్ కొట్టారు.
Highest Partnerships for India for Any Wickets in ICC Men’s T20 WC Knockouts:
97 – Ishan Kishan & Sanju Samson vs England, Mumbai (Wankhede), 2026 (2nd Wicket), Tonight*
84 – Robin Uthappa & Yuvraj Singh vs Australia, Durban, 2007 (3rd wicket)
73 – Rohit Sharma & Suryakumar… pic.twitter.com/XKdXrZk8Db
— CREX (@Crex_live) March 5, 2026
అప్పటి నుంచి వాంఖడేలో భారత్, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ వరకూ అదే అత్యధిక భాగస్వామ్యంగా ఉండేది. కానీ, శాంసన్.. ఇషాన్‌లు పవర్ హిట్టింగ్తో ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 97 పరుగులు జోడించిన ఈ ద్వయాన్ని ఎట్టకేలకు ఆదిల్ రషీద్ విడదీశాడు. సిక్సర్‌కు యత్నించిన ఇషాన్ బౌంబర లైన్ వద్ద జాక్స్‌కు నేరుగా క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఏ వికెట్‌కైనా 97 పరుగులే అత్యధికం. 2024 ఎడిషన్‌లో మూడో వికెట్‌కు 73 రన్స్ రాబట్టిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ జోడీ మూడో స్థానంలో ఉంది.
Another big over for India as Sanju Samson & Ishan Kishan are in full flow 💥💥#cricket #T20WorldCup2026 pic.twitter.com/lDRk5rID90
— Khel Cricket (@Khelnowcricket) March 5, 2026