Laughing | ప్రస్తుత ఆధునిక యుగంలో సగటు మనిషి నిత్యం అనేక ఒత్తిళ్లకు గురవుతున్నాడు. నిత్యం ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు అనేక రకాలుగా వివిధ రకాల సమస్యలతో సతమతం అవుతున్నాడు. ప్రస్తుతం సగటు మనిషి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాడు. దీనికి తోడు ఒత్తిడి అధికంగా ఉంటోంది. ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీని వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్కటి ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అదే.. నవ్వు. నవ్వడం వల్ల అనేక లాభాలు ఉంటాయని వారు అంటున్నారు. నవ్వు మన ఆరోగ్యానికి అనేక లాభాలను అందిస్తుందని వారు చెబుతున్నారు. రోజూ కనీసం 15 నిమిషాల పాటు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నవ్వ గలిగితే అనేక ఆరోగ్య ప్రమోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు.
నవ్వడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజూ కనీసం 15 నిమిషాల పాటు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నవ్వాల్సి ఉంటుంది. మీకు ఖాళీ ఉన్న సమయాన్ని ఎంచుకుని ఆ సమయంలో నవ్వవచ్చు. నవ్వేందుకు మీరు కామెడీ సీన్లు చూడవచ్చు. లేదా జోకులను చదవవచ్చు. లేదా పుస్తకాలను కూడా చదవ వచ్చు. ఎలాగైనా సరే నవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే 2 గంటల పాటు నిద్రించినంత లాభం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నవ్వడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అయితే షుగర్‌కు దీనికి సంబంధం ఏమిటని చాలా మంది అనుకోవచ్చు. కానీ సంబంధం ఉంటుంది. అదేమిటంటే.. చాలా మందికి ఒత్తిడి వల్ల కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. అలాంటి వారు నవ్వడం వల్ల ఒత్తిడిని క్రమంగా తగ్గించుకోవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి నవ్వు మేలు చేస్తుంది.
నవ్వడం వల్ల రక్త నాళాలు వెడల్పుగా మారి ప్రశాంతంగా ఉంటాయి. రక్త నాళాల వాపులు తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. నవ్వడం వల్ల ముఖంలో చర్మానికి రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో పోషకాలు లభిస్తాయి. ఫలితంగా చర్మానికి తేమ లభించి కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. అలాగే ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. కనుక నవ్వు అనేది మనల్ని నిరంతరం యవ్వనంగా కనిపించేలా చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
మనలో చాలా మంది నిత్యం అనేక సందర్భాల్లో వివిధ రకాల ఒత్తిళ్లకు గురవుతుంటారు. దీని కారణంగా చాలా మంది మద్యం, పొగ తాగడం వంటి చెడు వ్యసనాలకు బానిసలు అవుతారు. అయితే వాటి జోలికి వెళ్లకుండా నవ్వడం అలవాటు చేసుకుంటే చాలు, ఎంతో మేలు జరుగుతుంది. కనీసం రోజూ 15 నిమిషాల పాటు నవ్వితే అలాంటి వ్యసనాల జోలికి వెళ్లరు. పైగా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. రాత్రి పూట మైండ్ రిలాక్స్ అవుతుంది. దీని వల్ల నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. నవ్వడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుందని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. నవ్వడం వల్ల శరీరంలో యాంటీ బాడీల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల రోగకారక క్రిములు నశిస్తాయి. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే నవ్వడం అనేది సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంది. శరీరంలోని అనేక రకాల నొప్పులు సైతం తగ్గిపోతాయి. ఇలా రోజూ 15 నిమిషాల పాటు నవ్వడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.