నిద్ర లేమితో ముంచుకొచ్చే ఆ అనర్ధం..ఏంటంటే..!
రాత్రివేళ కంటినిండా నిద్రించడం శరీరానికి, మనసుకి ఉత్తేజాన్నిస్తుంది. నిద్రలేమితో పలు అనారోగ్యాల బారినపడే ముప్పు అధికం. ఇక నిద్రలేమితో పలు అనర్ధాలపై వైద్య నిపుణులు హెచ్చరిస్తుండగా తాజా అధ్యయనంలో నిద్రలేని రాత్రులతో వ్యక్తుల్లో స్వార్ధ ప్రవర్తనకు దారితీస్తుందని వెల్లడైంది.
న్యూఢిల్లీ : రాత్రివేళ కంటినిండా నిద్రించడం శరీరానికి, మనసుకి ఉత్తేజాన్నిస్తుంది. నిద్రలేమితో పలు అనారోగ్యాల బారినపడే ముప్పు అధికం. ఇక నిద్రలేమితో పలు అనర్ధాలపై వైద్య నిపుణులు హెచ్చరిస్తుండగా తాజా అధ్యయనంలో నిద్రలేని రాత్రులతో వ్యక్తుల్లో స్వార్ధ ప్రవర్తనకు దారితీస్తుందని వెల్లడైంది. నిద్రలేమి ఆయా వ్యక్తులు ఇతరులకు సాయం చేయడంలో ప్రభావం చూపుతుందని పీఎల్ఓఎస్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. ఒక గంట తక్కువ నిద్రించినా దాని ప్రభావం ఇతరులకు సాయం చేయడంతో వ్యక్తుల ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో వెల్లడైందని సెంటర్ ఫర్ హ్యూమన్ స్లీప్ సైన్స్‌లో సైకాలజీ పోస్ట్‌డాక్టరల్ ఫెలో బెన్ సైమన్ పేర్కొన్నారు.
ఓ గంట తక్కువగా నిద్రించినా అది మానవ దయాగుణం, అవసరంలో ఉన్న వ్యక్తలను ఆదుకోవాలనే గుణాలపైనా ప్రభావం చూపుతుందని ఆమె చెప్పుకొచ్చారు. నిద్రలేమి మనుషుల్లో స్వార్ధాన్ని ప్రేరేపిస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇతరులకు సాయ పడాలనే మన కాంక్షకు ఊతమిచ్చేందుకు కంటినిండా కునుకు తీయడం కీలకమని బెన్ సైమన్ చెప్పారు. నిద్రలేమితో కుంగుబాటు, యాంగ్జైటీ, ఊబకాయం వంటి పలు శారీరక, మానసిక రుగ్మతలు వెంటాడతాయని పరిశోధన సహ రచయిత మాథ్యూ వాకర్ వెల్లడించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

