న్యూఢిల్లీ : ఫిష్ ఆయిల్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధకులు పలు అధ్యయనాల్లో వెల్లడించారు. ఫిష్ ఆయిల్లో పుష్కలంగా ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఫిష్ ఆయిల్ తీసుకోవడం ద్వారా బరువు పెరుగుతారనే అపోహలను వీడాలని వ్యాయామం, మంచి ఆహారంతో పాటు దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఫిష్ ఆయిల్ ద్వారా అయిదు కీలక ప్రయోజనాలు అందివస్తాయని చెబుతున్నారు.
ఫిష్ ఆయిల్ తరచూ తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను సమర్ధంగా నిర్వహించడంలో ఫిష్ ఆయిల్ ప్రేరణగా నిలుస్తుంది. బీపీ లెవెల్స్ నిలకడగా ఉంచడం, రక్తనాళాల్లో కొవ్వు, వ్యర్ధాలు పేరుకుపోకుండా నిలువరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక శరీరం పలు వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు అవసరమైన ఇమ్యూనిటీ ఫిష్ ఆయిల్ ద్వారా సమకూరుతుంది.
ఫిష్ ఆయిల్ గుండె, మెదడు, కండ్లు, ఎముకల పుష్టికి ఉపయోగకరంగా ఉంటుంది. ఫిష్ ఆయిల్ తరచూ తీసుకుంటే మెదడు ఆరోగ్యం బావుంటుంది. ఫిష్ ఆయిల్లో ఒమెగా 3 ఆమ్లాలు ఉండటంతో ఎముక, కండర పుష్టికి దోహదపడుతుంది. ఇక చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో ఫిష్ ఆయిల్‌కు ఏదీ సాటిరాదు. వయోభారం ఛాయలను దరిచేరనీయకుండా, చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా ఉంచడంలో ఫిష్ ఆయిల్ సానుకూల ప్రభావం చూపుతుంది.