బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - May 22, 2020 , 13:48:50

ఈ ఆదివారాల్లో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం! ఎక్కడంటే..?

ఈ ఆదివారాల్లో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం! ఎక్కడంటే..?

లాక్‌డౌన్‌లో చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ఈ ముహూర్తం పోతే మంచి ముహూర్తం దొరకడం కష్టమని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివాహం చేసుకున్నవాళ్లు చాలామందిని సోషల్‌మీడియాలో చూస్తూనే ఉన్నాం. మే నెలలో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్న వాళ్లకి కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రానున్న రెండు ఆదివారాలు అంటే మే 24, మే 31కి ముందే నిర్ణయించుకున్న వివాహాలకు కేంద్రం నిర్దేశించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను పాటిస్తూ జరుపుకోవచ్చని తెలిపింది. వివాహానికి 50 మందిలోపు అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుందని, సామాజిక దూరం తప్పకుండా పాటించాలని వెల్లడించినది. దీనితోపాటు మాస్కులు ధరించడం, చేతులకు శానిటైజర్‌తో నిత్యం శుభ్రపరుచుకుంటూ ఉండాలని సూచించింది.


logo