Jaggery Water | బెల్లాన్ని సహజసిద్ధమైన పద్ధతిలో తయారు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే తీపి తినాలనుకునే వారు చక్కెరకు బదులుగా బెల్లం తింటే మంచిదని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే రోజూ బెల్లం తినడం కష్టం అనుకునే వారు బెల్లాన్ని నీటిలో కలిపి కూడా తాగవచ్చు. ఈ విధంగా బెల్లం నీళ్లను తాగడం వల్ల కూడా మనకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. చిన్న బెల్లం ముక్కను రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ నీళ్లను సేవించాలి. దంతాలను తోముకున్న తరువాతే ఈ నీళ్లను తాగాలి. ఉదయం బెల్లం నీళ్లను సేవిస్తే శరీరానికి శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట ఉండవు.
బెల్లం నీళ్లను తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. జీర్ణాశయంలో ఎంజైమ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. బెల్లం నీళ్లను తాగడం వల్ల లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్లోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. లివర్లోని కొవ్వు కరుగుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారు బెల్లం నీళ్లను తాగుతుంటే ఫలితం ఉంటుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్తో పోరాటం చేస్తాయి. కణాలు దెబ్బ తినకుండా చూస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. బెల్లంలో అనేక యాంటీ ఆక్సిడెంట్లతోపాటు మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. దీంతో రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.
బెల్లంలో ఉండే ఐరన్, ఫోలేట్ మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. వారిలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తాయి. తీవ్ర రక్త స్రావం జరగకుండా చూస్తాయి. అలాగే ఈ నీళ్లను తాగడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. బెల్లంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. అలాగే బెల్లం నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బెల్లం నీళ్లను తాగడం వల్ల లభించే మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం కాంతివంతంగా మారి మెరిసేలా చేస్తాయి.
బెల్లం నీళ్లను ఉదయం తాగడం వీలు కాదు అనుకునే వారు రాత్రి పూట భోజనం చేసిన తరువాత లేదా నిద్రకు ముందు తాగవచ్చు. అయితే బెల్లం శరీరంలో వేడిని పెంచుతుంది. కనుక బెల్లం నీళ్లను చల్లగా తాగితే మేలు. ఈ నీళ్లను తాగితే కొందరికి పడకపోవచ్చు. విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు ఈ నీళ్లను తాగకపోవడమే మంచిది. నాణ్యమైన బెల్లంతో తయారు చేసిన నీళ్లనే తాగాలి. బెల్లం క్వాలిటీగా లేకపోయినా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు పని ముగిసిన తరువాత బెల్లం నీళ్లను తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. మళ్లీ ఉత్సాహంగా మారుతారు. ఇలా బెల్లం నీళ్లను సేవించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.