Latest Study | కఠిన వ్యాయామంతో ఇమ్యూనిటీపై ప్రతికూల ప్రభావం
కఠిన వ్యాయామం రోగనిరోధక వ్యవస్ధను అణిచివేస్తుందని తాజా అధ్యయనం (Latest Study) వెల్లడించింది.
న్యూఢిల్లీ : కఠిన వ్యాయామం రోగనిరోధక వ్యవస్ధను అణిచివేస్తుందని తాజా అధ్యయనం (Latest Study) వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బందిలో వ్యాయామం అనంతరం 4700 ఫ్లూయిడ్ అణువులను విశ్లేషించిన మీదట జర్నల్ మిలటరీ మెడికల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఈ వివరాలను తెలిపింది. ఎమర్జెన్సీ వర్కర్లు, అథ్లెట్లు వంటి కఠిన వ్యాయామ శిక్షణ అవసరమైన వృత్తుల్లో ఉన్న వ్యక్తులకు ఈ అధ్యయన వివరాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.
అధిక ఫిట్నెస్ లెవెల్స్ కలిగిన వ్యక్తులు కఠిన వ్యాయామం అనంతరం వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బారిన పడే ముప్పు పొంచి ఉందని పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబరేటరీకి చెందిన బయోమెడికల్ సైంటిస్ట్ ఎర్నెస్టో నకయసు పేర్కొన్నారు. ఓ మోస్తరు శారీరక శ్రమతో దీర్ఘకాలంలో రోగనిరోధక వ్యవస్ధపై సానుకూల ప్రభావం ఉంటుందనేందుకు ఆధారాలున్నా కఠిన వ్యాయామం అనంతరం రోగనిరోధక వ్యవస్ధపై తక్షణమే ప్రతికూల ప్రభావం ఉంటుందనే విషయం వివాదాస్పదంగా మారింది.
నకయసు, ఆయన సహచరులు చేపట్టిన అధ్యయనంలో భాగంగా 11 మంది అగ్నిమాపక సిబ్బంది కఠిన వ్యాయామం చేసే ముందు, అనంతరం వారి బ్లడ్ ప్లాస్మా, యూరిన్, సలీవాను పరిశీలించారు. ఈ క్రమంలో వారి రోగనిరోధక వ్యవస్ధ అణిచివేయబడిందనే సంకేతాలు గుర్తించారు. ఫైర్ ఫైటర్స్ ద్రవాలు, ఆక్సిజన్, ఎనర్జీ లెవెల్స్‌తో పాటు వాపు ఊసంబంధిత అణువుల్లో తగ్గుదలను కనుగొన్నారు. అయితే శాంపిల్ సైజ్ తక్కువగా ఉండటం, అగ్నిమాపక సిబ్బంది కాలుష్య వాతావరణంలో పనిచేయడం వంటి కారణాలతో అత్యధికులపై అధ్యయనం చేపట్టాలనే వాదన వినిపిస్తోంది.
Read More :
Health tips | ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

