Milk | చెన్నై, మార్చి 27: పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. కానీ, మనం తాగే పాలు నాణ్యమైనవేనా అనేది ముఖ్యం. కల్తీ పాల వల్ల మూత్రపిండాల సమస్యలు, జీర్ణాశయ సమస్యలు, అతిసారం వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంటుంది. కల్తీ పాలను గుర్తించాలంటే ల్యాబ్లో పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఇది ఖరీదైన, ఎక్కువ సమయం కేటాయించాల్సిన వ్యవహారం. ఇప్పుడు ఇంట్లోనే సులువుగా కల్తీ పాలను గుర్తించవచ్చని చెప్తున్నారు ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు.
పాల కల్తీని 30 సెకండ్లలో గుర్తించగలిగే పేపర్ ఆధారిత పోర్టబుల్ పరికరాన్ని వీరు అభివృద్ధి చేశారు. సాధారణంగా పాల కల్తీకి వినియోగించే యూరియా, డిటెర్జెంట్లు, సబ్బు, స్టార్చ్, హైడ్రోజెన్ పెరాక్సైడ్, సోడియం హైడ్రోజెన్ కార్బొనేట్, ఉప్పు వంటి వాటిని ఇది గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కొత్త పరికరంతో సులువుగా పాలతో పాటు నీరు, జ్యూసులు, మిల్క్షేక్లలో కల్తీని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.