Sudden Weight Loss | చాలా మంది అధికంగా బరువు పెరిగేందుకు పలు కారణాలు ఉన్నట్లే కొందరు బరువు తగ్గేందుకు కూడా పలు కారణాలు ఉంటాయి. దీర్ఘకాలికంగా మందులను వాడడం, హైపర్ థైరాయిడ్ సమస్య ఉండడం, లోబీపీ, లో షుగర్, పోషకాహార లోపం వంటి అనేక కారణాల వల్ల కొందరు ఉన్నట్లుండి సడెన్‌గా బరువు తగ్గుతారు. ఈ తేడాను కూడా స్పష్టంగా గమనించవచ్చు. అయితే ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోతే బరువు తగ్గడం గురించి చింతించాల్సిన పనిలేదు. ఇక బరువు తగ్గుతున్నవారు నీరసం గనక ఉంటే అప్పుడు కచ్చితంగా ఆహారం విషయంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల నీరసం తగ్గడంతోపాటు బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గకుండా అడ్డుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.
రోజూ ఆహారంలో బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, పీకన్ నట్స్, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటి వాటిని తీసుకుంటుండాలి. వీటిని గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టి తినాలి. అన్నింటినీ కలిపి గుప్పెడు మోతాదులో తింటున్నా ఉపయోగం ఉంటుంది. ఈ గింజలు, విత్తనాలను తినడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు ప్రొటీన్లు అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. శరీరానికి శక్తిని అందించి నీరసాన్ని తగ్గిస్తాయి. పీనట్ బటర్‌ను ఆహారంలో భాగం చేసుకున్నా ఉపయోగం ఉంటుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు శరీరానికి ఎంతో శక్తిని అందించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. దీంతో నీరసం తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గకుండా అడ్డుకోవచ్చు.
అవకాడోలలో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. కనుక అవకాడోలను తరచూ తింటుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఇవి కూడా శక్తిని అందించి బరువును అదుపులో ఉంచుతాయి. ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, కనోలా ఆయిల్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. బరువును పెంచడంలో, నీరసాన్ని తగ్గించడంలో ఇవి ఎంతగానో పనిచేస్తాయి. అలాగే వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు చేపలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి శక్తిని అందించి నీరసం తగ్గేలా చేస్తాయి. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చికెన్, మటన్ వంటి ఆహారాలను తరచూ తింటున్నా ఉపయోగం ఉంటుంది. బరువు తగ్గుతున్నవారు, నీరసంగా ఉన్నవారు ఈ ఆహారాలను తింటుంటే మేలు జరుగుతుంది.
బరువు తగ్గుతున్నవారు తీసుకోవాల్సిన ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిని రోజుకు ఒకటి చొప్పున ఉడకబెట్టి తింటుండాలి. కోడిగుడ్లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. బరువు అదుపులో ఉండేలా చూస్తాయి. అలాగే కొవ్వు తీయని ఫుల్ క్రీమ్ పాలను తాగవచ్చు. లేదా గడ్డ పెరుగును రోజూ తినాలి. చీజ్‌ను ఆహారంలో భాగం చేసుకున్నా ఉపయోగం ఉంటుంది. పప్పు దినుసులు, శనగలను తింటుండాలి. ఇవి ప్రోటీన్లను అందిస్తాయి. శరీర బరువు నియంత్రణలో ఉండేలా చూస్తాయి. ఓట్స్, బ్రౌన్ రైస్, ఆలుగడ్డలు, ఖర్జూరాలు, కిస్మిస్, యాప్రికాట్స్, అంజీర్ వంటి ఆహారాలను తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ శరీరానికి శక్తిని అందిస్తాయి. బరువు పెరిగేందుకు సహాయం చేస్తాయి. ఇలా ఆయా ఆహారాలను రోజూ తీసుకుంటుంటే అకస్మాత్తుగా బరువు తగ్గడాన్ని నివారించవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.