Clogged Arteries | మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్డీఎల్ అంటారు. ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. శరీరంలో ఈ రెండు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండాలి. హెచ్‌డీఎల్ తగినంతగా ఉంటేనే ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే శరీరంలో ఎల్డీఎల్ అధికంగా పేరుకుపోతే గుండె జబ్బులు వస్తాయి. ముఖ్యంగా ఎల్డీఎల్ రక్త నాళాల్లో పేరుకుపోతుంది. దీన్నే ప్లేక్ అంటారు. ఇందులో ఎల్డీఎల్తోపాటు ఇతర మృత చర్మ కణాలు, రక్తం, ఇతర కణజాలం కూడా ఉంటాయి. అవన్నీ కలిసి ప్లేక్లా మారుతాయి. దీంతో రక్త నాళాల్లో బ్లాక్స్ లేదా క్లాట్స్ ఏర్పడుతాయి. ఇవి హార్ట్ ఎటాక్ వచ్చేలా చేస్తాయి. కనుక శరీరంలో ఎల్‌డీఎల్‌ను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే రక్త నాళాల్లో బ్లాక్స్ లేదా క్లాట్స్ ఏర్పడకుండా చూసుకోవాలి. ఇందుకు గాను పలు ఆహారాలు మనకు ఎంతగానో దోహదం చేస్తాయి.
రక్త నాళాల్లో క్లాట్స్ లేదా బ్లాక్స్ ఏర్పడకుండా అవి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎల్డీఎల్ స్థాయిలు తగ్గాలన్నా రోజూ గ్రీన్ టీని తాగుతుండాలి. గ్రీన్ టీని రోజుకు 2 లేదా 3 కప్పులు తాగితే ఉపయోగం ఉంటుంది. గ్రీన్ టీలో కాటెకిన్స్, ఫినాల్స్ అనబడే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. రక్తంలో ఉండే ఎల్డీఎల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో క్లాట్స్ కరిగిపోతాయి. ఫలితంగా రక్త నాళాల ఆరోగ్యం మెరుగు పడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఇక రక్త నాళాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎల్డీఎల్ స్థాయిలు తగ్గాలన్నా అందుకు ఆలివ్ ఆయిల్ కూడా ఎంతగానో పనిచేస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆలివ్ ఆయిల్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు సుమారుగా 41 శాతం వరకు తక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. కనుక రోజూ ఆలివ్ ఆయిల్‌ను వాడుతుంటే మేలు జరుగుతుంది.
రక్త నాళాల ఆరోగ్యం కోసం పాలకూర కూడా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను శుభ్రం చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రలో ఉంటాయి. దీని వల్ల గుండె పనితీరు మెరుగు పడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పసుపును ఆహారంలో భాగం చేసుకుంటున్నా ఉపయోగం ఉంటుంది. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రక్త నాళాల వాపులను తగ్గిస్తాయి. రక్త నాళాల్లో ఉండే ప్లేక్‌ను తొలగిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. పసుపు కలిపిన గోరు వెచ్చని నీళ్లను లేదా పాలను రోజూ రాత్రి పూట తాగుతుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని అంటుంటారు. అది అక్షరాలా వాస్తవమేనని చెప్పవచ్చు. ఎందుకంటే యాపిల్‌లో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్త నాళాల్లో ఉండే ప్లేక్‌ను కరిగిస్తాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల రోజూ ఒక యాపిల్‌ను తింటుండాలి. ఇక బీట్రూట్ కూడా గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. బీట్రూట్ రోజూ ఒక కప్పు మోతాదులో తినాలి. లేదా ఒక కప్పు మోతాదులో దాని జ్యూస్‌ను తాగాలి. బీట్ రూట్లో నైట్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్త నాళాల్లో ఉండే క్లాట్స్ కరిగేలా చేస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఇలా ఆయా ఆహారాలను తీసుకుంటే రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుకుని గుండె పనితీరును మెరుగు పరుచుకోవచ్చు.