Coriander Leaves | కొత్తిమీరను చాలా మంది రోజూ వంటల్లో వేస్తుంటారు. అనేక రకాల కూరల్లో కొత్తిమీర ఆకులను వేస్తారు. కానీ తినేటప్పుడు ఈ ఆకులు వస్తే మాత్రం తీసి పక్కన పెడతారు. అయితే అలా పక్కన పెడితే అనేక పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. కొత్తిమీర ఆకులు మనకు ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల వాటిని కచ్చితంగా తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొత్తిమీర ఆకులను నేరుగా తినలేని వారు వాటి ఆకులను జ్యూస్‌గా చేసి అయినా తాగవచ్చని సూచిస్తున్నారు. కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి వాటిని కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్‌లా పట్టాలి. అనంతరం ఆ జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో ఉదయం పరగడుపునే తాగాలి. ఇలా కూడా కొత్తిమీర ఆకులను తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆకుల జ్యూస్‌ను రోజూ సేవిస్తుంటే అనేక లాభాలు కలుగుతాయని, పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
కొత్తిమీర ఆకుల జ్యూస్‌ను రోజూ తాగుతుంటే ఫ్రీ ర్యాడికల్స్ తొలగిపోతాయి. ఈ ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్, క్వర్సెటిన్ వంటి సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. కనుక ఈ ఆకులతో జ్యూస్ తయారు చేసి సేవిస్తే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించుకోవచ్చు. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. రక్త నాళాల వాపులు తగ్గుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ ఆకుల్లో అధికంగా ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కొత్తిమీర ఆకుల జ్యూస్‌ను సేవిస్తుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఉండే క్లాట్స్ కరిగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఈ రసాన్ని తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఈ ఆకుల్లో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. కనుక జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల పొట్టలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ సమస్య తొలగిపోతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆహారం సులభంగా జీర్ణమై జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కొత్తిమీర ఆకుల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరగకుండా నిరోధించవచ్చు.
కొత్తిమీర ఆకుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ ఆకుల రసాన్ని తాగుతుంటే రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కనుక ఈ ఆకుల జ్యూస్‌ను తాగుతుంటే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా చర్మంపై ఉండే వాపులు తగ్గిపోతాయి. అలాగే చర్మంపై ఉండే ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. గజ్జి, తామర వంటి చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా కొత్తిమీర ఆకులు మనకు ఎంతో మేలు చేస్తాయి. కనుక ఈ ఆకులను నేరుగా తినలేకపోతే వీటిని జ్యూస్ చేసుకుని అయినా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.