Blood Sugar Levels | రక్తంలో చక్కెర స్థాయిలు అసలు నియంత్రణలో ఉండడం లేదా.. ఇలా చేయండి..
రక్తంలో చక్కెర స్థాయిలు తరచూ మారుతూ ఉంటే నియంత్రించడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి పరిష్కారం చాలా సులభమైన ఉదయం అలవాట్లలోనే ఉండొచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేవగానే మొదటి గంట శరీరంలోని మెటాబాలిజం రిథమ్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Blood Sugar Levels | రక్తంలో చక్కెర స్థాయిలు తరచూ మారుతూ ఉంటే నియంత్రించడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి పరిష్కారం చాలా సులభమైన ఉదయం అలవాట్లలోనే ఉండొచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేవగానే మొదటి గంట శరీరంలోని మెటాబాలిజం రిథమ్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో ఉదయం అలవాట్లను మార్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండి, అకస్మాత్తుగా పెరగడం లేదా పడిపోవడం నివారించవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఉదయం పాటించే అలవాట్లు కార్టిసోల్ స్థాయిలు, ఇన్సులిన్ స్పందన, రోజంతా ఉండే శక్తిపై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. నాలుగు ముఖ్యమైన అలవాట్లను ఉదయం దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చని ఈ అలవాట్లు గ్లూకోజ్ నియంత్రణలో ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
శరీర జీవగడియారం పనితీరు..
గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించాలంటే మొదటగా శరీర గడియారాన్ని సరిచేయడం అవసరం. ప్రకృతి కాంతి-చీకటి చక్రానికి అనుగుణంగా శరీర బయోలాజికల్ క్లాక్ పనిచేస్తే హార్మోన్ సమతుల్యత మెరుగుపడుతుంది. మెలటోనిన్, కార్టిసోల్, ఇన్సులిన్, లెప్టిన్, గ్రెలిన్ వంటి హార్మోన్ల విడుదల సక్రమంగా జరుగుతుంది. ఇందుకోసం ప్రతిరోజూ ఒకే సమయానికి లేవడం, ఉదయం సూర్యకాంతి తీసుకోవడం, రాత్రివేళ స్క్రీన్ టైమ్ తగ్గించడం అవసరం. ఇలా చేయడం వల్ల కార్టిసోల్ సమతుల్యత మెరుగై, ఇన్సులిన్ స్పందన బాగుపడి, ఉపవాస సమయంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రెండవది, బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు కొన్ని ప్రత్యేకమైన పానీయాలు తీసుకోవాలి. రాత్రంతా నానబెట్టిన ఒక టీస్పూన్ మెంతులను నీటితో తీసుకోవడం వల్ల చక్కెర శోషణ నెమ్మదిస్తుంది, ఇన్సులిన్ స్పందన మెరుగుపడుతుంది. అలాగే ఒక కప్పు నీటిలో ఒకటిన్నర టీస్పూన్ సిలోన్ దాల్చినచెక్క కలిపి తాగడం వల్ల ఇన్సులిన్ ప్రభావం మెరుగై, కణాలు గ్లూకోజ్‌ను సులభంగా గ్రహించగలవని నిపుణులు తెలియజేస్తున్నారు.
తేలికపాటి వ్యాయామాలు..
ఇక మూడవది, అల్పాహారం ముందు తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. సూర్య నమస్కారాలు, స్క్వాట్స్, వేగంగా నడక లేదా సాధారణ మొబిలిటీ వ్యాయామాలు చేయడం వల్ల భోజనం తర్వాత చక్కెర పెరుగుదల తగ్గుతుంది. కండరాలు రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ను ఉపయోగించుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అదనంగా, ఇది ఇన్సులిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. చివరిగా, సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడం అత్యంత కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. టోస్ట్, బిస్కెట్లు, పోహా లేదా కార్న్‌ఫ్లేక్స్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లపై మాత్రమే ఆధారపడకూడదని కూడా వారు హెచ్చరిస్తున్నారు. బదులుగా, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిపిన ఆహారం తీసుకోవాలి.
ప్రోటీన్లు ముఖ్యం..
గుడ్లు, పనీర్, గ్రీక్ యోగర్ట్, టోఫు లేదా దాల్ చీలా ద్వారా 25-30 గ్రాముల ప్రోటీన్ పొందాలి. కూరగాయలు, గింజలు ఫైబర్‌ను అందిస్తాయి. నట్స్, నెయ్యి వంటి వాటితో మంచి కొవ్వులు చేరతాయి. ఈ విధంగా తీసుకునే అల్పాహారం జీర్ణక్రియను నెమ్మదిగా చేసి ఎక్కువసేపు తృప్తి కలిగిస్తుంది. మధ్యాహ్నానికి ముందు వచ్చే ఆకలిని తగ్గిస్తుంది. ముఖ్యంగా, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించి రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది. ఈవిధంగా ఉదయం అలవాట్లలో చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి స్థిరమైన రక్త చక్కెర స్థాయిలు మెరుగైన శక్తి, ఏకాగ్రత, మెటబాలిక్ ఆరోగ్యానికి దోహదపడతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

