Health Tips : బ్రేక్‌ఫాస్ట్ అనగానే సౌతిండియన్ క్లాసిక్స్ ఇడ్లీ, దోశలే ముందుగా అందరికీ గుర్తుకొస్తాయి. పోషకాలతో కూడిన ఈ అల్పాహారాలు గంటల కొద్దీ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అయితే ఇడ్లీల్లో మన శరీరానికి శక్తిని అందించే ప్రొటీన్లు ఎంతవరకూ ఉంటాయనే వివరాలను ఆహార నిపుణులు క్రిష్ అశోక్ అందించారు. ఇడ్లీల్లో మినప పప్పు ఉండటంతో ప్రొటీన్ అధికంగా ఉంటుందనే అంచనాలు సరైనవి కాదని ఇవి మనం అనుకునే ప్రొటీన్ హీరోలు కావని అశోక్ చెబుతున్నారు.
ఇడ్లీలో ఒకటి నుంచి రెండు గ్రాముల మించి ప్రొటీన్ ఉండదని, ఓ పూరీలో ఉండే ప్రొటీన్‌తో ఇది సమానమని చెప్పారు. ఇడ్లీ పిండిలో తగినంత పప్పు ఉండకపోవడం ప్రధాన కారణమని, ఇడ్లీ పిండిలో మూడొంతులు రైస్, ఓ వంతు మినపప్పు ఉంటుంది. ఇది చాలా తక్కువ పరిమాణమని క్రిష్ అశోక్ చెబుతున్నారు. రెస్టారెంట్స్‌లో పప్పు శాతం ఇంకా తక్కువగా ఉంటుందని అన్నారు. అధిక ధర కారణంగా పప్పులను వారు మరింత తక్కువగా వాడతారని చెప్పారు.
పప్పు కూడా ప్రొటీన్‌కు ముఖ్యమైన వనరు కాదని అన్నారు. ఇక ఇడ్లీలో ప్రొటీన్ అధికంగా ఉండాలంటే ఇడ్లీ పిండిలో రైస్ కంటెంట్‌ను తగ్గించి పప్పును ఎక్కువగా జోడించాలని సూచించారు. ప్రొటీన్ అధికంగా ఉండేందుకు మినపప్పు బదులు సోయాబీన్స్ వాడాలని చెప్పారు. 100 గ్రాముల సోయాబీన్లో 36 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. సోయాబీన్‌ను వాడటం ద్వారా ఒక ఇడ్లీలో నాలుగు గ్రాముల ప్రొటీన్ లభిస్తుందని క్రిష్ అశోక్ చెబుతున్నారు.
Read More :
Sai Pallavi Dance | చెల్లి పెళ్లిలో సాయి పల్లవి డ్యాన్స్.. వీడియో