Spinach | పాలకూరలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్లు ఎ, సి, కె, మెగ్నిషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఒక కప్పు పాలకూర ద్వారా 2.7 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. ఇది మనకు రోజుకు కావల్సిన ఐరన్‌లో 15 శాతం. అయితే పాలకూరను మనం ఎలా పడితే అలా వండి తింటే మనకు ఐరన్ కాదు, ఇతర పోషకాలు కూడా లభించవు. పాలకూర సరైన రీతిలో వండి తింటేనే దాంతో మనం ఐరన్‌ను పొందవచ్చు. అలాగే ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. పాలకూరను విటమిన్ సి ఉండే ఆహారాలతో తినాల్సి ఉంటుంది. దీంతో అందులో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.
మన శరీరానికి ఐరన్ కావాలంటే దాన్ని పాలకూర తింటే నేరుగా పొందలేము. కనుక విటమిన్ సి ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. దీంతో విటమిన్ సి సహాయంతో మన శరీరం పాలకూరలో ఉండే ఐరన్‌ను శోషించుకుంటుంది. ముఖ్యంగా మనకు నిమ్మకాయలు, కివి, స్ట్రాబెర్రీలు, క్యాప్సికం వంటి వాటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కనుక వీటిని పాలకూరతోపాటు తినాల్సి ఉంటుంది. దీంతో శరీరానికి ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీని వల్ల రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
పాలకూరను పచ్చిగా కంటే ఉడకబెట్టి తింటేనే ఎంతో మంచిది. ఎందుకంటే పాలకూరను ఉడకబెడితే అందులో ఉండే పోషకాల శాతం పెరుగుతుంది. పాలకూరను ఉడకబెట్టడం వల్ల అందులో ఉండే ఐరన్ శాతం ఎక్కువవుతుంది. అలాగే పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా పచ్చి పాలకూరలో లుటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అయితే పాలకూరను ఉడకబెడితే ఆగ్జలేట్స్ సులభంగా విడిపోతాయి. దీని వల్ల అంత సులభంగా కిడ్నీ స్టోన్లు ఏర్పడవు. అలాగే శరీరం ఐరన్‌ను కూడా అధికంగా శోషించుకుంటుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు పాలకూరను తింటే ఇంకా మంచిది. పాలకూరలో కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి కొవ్వులో కరుగుతాయి. కనుక కొవ్వు ఉండే ఆహారాలను తినాలి. కొవ్వు అంటే ఆరోగ్యకరమైన కొవ్వు అన్నమాట. ఇది వృక్ష సంబంధ పదార్థాల్లో అధికంగా ఉంటుంది. జంతు సంబంధ పదార్థాల్లోనూ కొవ్వు ఉంటుంది. కానీ వీటిని ఎక్కువగా తింటే హానికరం. కనుక వృక్ష సంబంధ పదార్థాల ద్వారా కొవ్వును పొందాల్సి ఉంటుంది. ఇక పాలకూరను అవకాడో, శనగలతో కలిపి తినవచ్చు. దీంతో మనకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే పాలకూరతో స్మూతీలను తయారు చేసి కూడా తాగవచ్చు. ఇలా కూడా ఐరన్‌ను పొందవచ్చు. ఈ విధంగా పాలకూరను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.