Cholesterol Levels | కొలెస్ట్రాల్ మరీ ఎక్కువగా ఉండడం మంచిది కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉండడం ప్రాణాంతకం అవుతాయి. గుండె జబ్బులను తెచ్చి పెడతాయి. హార్ట్ ఎటాక్‌కు కారణమవుతాయి. అందువల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను డాక్టర్లు ఇచ్చే మందులతోపాటు వంట ఇంట్లో ఉండే పలు మసాలా దినుసులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పసుపు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్.. అంటే ఎల్డీఎల్ స్థాయిలను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్.. అంటే.. హెచ్‌డీఎల్ స్థాయిలను పెంచుతుంది. రక్తనాళాల్లో ఉండే పూడికలను తగ్గిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా మనం రోజూ తీసుకునే వెల్లుల్లిలోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో ఇది కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో యాల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఎల్డీఎల్ స్థాయిలను తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్‌ను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
దాల్చిన చెక్కను మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. ఎక్కువగా మసాలా వంటకాల్లో దీన్ని వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. దాల్చిన చెక్కలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఎల్డీఎల్తోపాటు ట్రై గ్లిజరైడ్స్ తగ్గుతాయి. మెంతులు కూడా కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రించ గలవు. వీటిల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీంతో అది శరీరం నుంచి మలం ద్వారా బయటకు పోతుంది. ఇలా మెంతులు కూడా మనకు మేలు చేస్తాయి.
వాంతులు, వికారం తగ్గించేందుకే కాదు, కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. ఎల్‌డీఎల్‌ను తగ్గించి హెచ్‌డీఎల్‌ను పెంచుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. మిరియాలలో పైపరైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కూడా ఇది కలిగి ఉంటుంది. మిరియాలను రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
ధనియాలను మనం వంటల్లో తరచూ ఉపయోగిస్తుంటాం. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించగలవు. ధనియాలలో హైపోలైపిడిమిక్ గుణాలు ఉంటాయి. కనుక ఎల్డీఎల్ తగ్గుతుంది. హెచ్‌డీఎల్ పెరుగుతుంది. దీన్ని గుండెకు మంచి చేసే మసాలా దినుసుగా చెబుతారు. తులసి ఆకులు చక్కని సువాసనను అందిస్తాయి. వీటిల్లో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా పలు ఆహారాలను తీసుకుంటున్నట్లయితే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను సహజసిద్ధంగా తగ్గించుకోవచ్చు.