Spondylitis | వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Spondylitis | ఆఫీసు వర్క్ చేసే వారిలో తరచూ వినిపించే సమస్య మెడనొప్పి లేదా నడుం నొప్పి. ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడమే దీనికి కారణం. అలాంటిది వర్క్ ఫ్రం హోంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది?

Spondylitis | ఆఫీసు వర్క్ చేసే వారిలో తరచూ వినిపించే సమస్య మెడనొప్పి లేదా నడుం నొప్పి. ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడమే దీనికి కారణం. ఈ సమస్యను స్పాండిలైటిస్ ( Spondylitis ) అని అంటారు. ఆఫీసులో టేబుల్, కుర్చీ అన్ని ఉన్నా కూడా చాలామందికి ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. అలాంటిది వర్క్ ఫ్రం హోం ( Work from Home )లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా చెప్పాలంటే చాలామంది సోఫాలు, బెడ్లపై కూర్చొని పనిచేస్తుంటారు. అలాంటి సమయంలో ఎక్కువసేపు వంగి పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే వర్క్ ఫ్రం హోంలో మెడ నొప్పి, నడుం నొప్పి బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించడం అవసరం..

- ఎక్కువ సేపు సోఫాలో లేదా బెడ్‌పై కూర్చోకపోవడం మంచిది. అలా కూర్చున్నప్పుడు లాప్టాప్లో వర్క్ చేయడానికి కాస్త వంగి పనిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల వెన్నునొప్పి వస్తుంది. కాబట్టి కుర్చీలో కూర్చొని పనిచేయడమే మంచిది.
- మనం కూర్చునే సీటు కూడా సౌకర్యవంతంగా ఉండాలి. అంటే సీటు ఎత్తులో ఉండి.. పాదాలు నేలను తాకేలా ఉంటే బెటర్.
- కుర్చీకి వెనకాల బ్యాక్‌రెస్ట్ తప్పనిసరిగా ఉండాలి. వెన్నుముక బ్యాక్రెస్ట్కు ఆనేలా పిల్లో లేదా టవల్ సపోర్టుగా పెట్టుకోవాలి.
- కూర్చునే భంగిమ కూడా సరిగ్గా ఉండాలి. వాలిపోయినట్లుగా కూర్చోవద్దు. నిటారుగా కూర్చోవాలి.
- లాప్టాప్ లేదా డెస్క్‌టాప్ స్క్రీన్ మన కంటికి ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. అలాగే మానిటర్ 16 నుంచి 30 అంగుళాల దూరంలో ఉండాలి.

- ప్రతి గంటకు ఒకసారి స్వల్ప విరామం తీసుకోవాలి. కూర్చున్న ప్లేస్ నుంచి లేచి రెండు నిమిషాలు నడవడం, లేదా చేతులు, కాళ్లను ఆడించడం చేయాలి.
- తరచూ కాళ్లు, చేతులు కదిలించడం వల్ల కీళ్లలో స్టిఫ్నెస్ ఏర్పడకుండా ఉంటుంది. తద్వారా రక్తసరఫరా పెరుగుతుంది.
- గంటల తరబడి కూర్చుని పని చేయాలంటే ఫిట్‌గా ఉండటం అవసరం. దీనికోసం రోజూ ఉదయం వ్యాయామం చేయాలి.
- మెడ, వెన్ను లేదా నడుము నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

