Breast Size Increase | పురుషుల కన్నా స్త్రీలే తమ అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖం నుంచి కాళ్ల వరకు ప్రతి భాగం కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ కొందరు స్త్రీలకు వక్షోజాలు సరైన పరిమాణంలో ఉండవు. దీంతో వారు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. వక్షోజాల పరిమాణం పెద్దగా ఉన్న స్త్రీలను చూసి విచారం వ్యక్తం చేస్తుంటారు. దీంతో వాటి పరిమాణం పెంచుకునేందుకు వివిధ రకాల పద్ధతులను పాటిస్తుంటారు. చాలా మంది ఇందుకు గాను సర్జరీల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో వక్షోజాల పరిమాణం సహజ సిద్ధంగానే పెరుగుతుంది. ఇందుకు ఎలాంటి ఔషధాలను వాడాల్సిన పనిలేదు. ఖరీదైన చికిత్స అవసరం లేదు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
వక్షోజాల పరిమాణం పెంచుకోవాలంటే అతి సామాన్యమైన పద్ధతి వాటిపై ఒత్తిడి కలిగించడం. బోర్లా పడుకోవాలి. లేదా బెడ్‌కు కానీ లేదా నేలకు గానీ తగిలిస్తూ కాస్తంత ఒత్తిడిని కలిగించాలి. లేదా నిలబడి గోడకు ఎదురుగా ప్రెస్ చేయవచ్చు. వెంటనే రిలాక్స్ అవ్వాలి. ఇలా రోజుకు కనీసం 10 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా పుషప్స్ చేస్తున్నా కూడా బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. పుషప్స్ సాధారణంగా చాలా మందికి అలవాటు ఉండదు. కనుక ప్రారంభంలో 5 నుంచి 10 చొప్పున పుషప్స్‌తో మొదలు పెట్టండి. క్రమంగా రోజూ పుషప్స్‌ను పెంచుతూ వెళ్లండి. రోజుకు కనీసం 30 పుషప్స్ చేసేలా ప్లాన్ చేసుకోండి. దీంతో వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఇది చక్కని వ్యాయామంగా పనిచేస్తుంది.
నిటారుగా నిలబడి రెండు చేతులను వెనుక రెండు పిరుదులపై పెట్టండి. తరువాత కుడి చేతిని ఎడమ పిరుదుపై, ఎడమ చేతిని కుడి పిరుదుపై పెట్టండి. ఇలా ఈ భంగిమలో 10 నుంచి 15 సెకన్ల పాటు ఉండండి. ఇలా 10 సార్లు చేయండి. దీంతో తప్పక ఫలితం ఉంటుంది. అలాగే ఈత కొట్టడం వల్ల కూడా చక్కని వ్యాయామం జరిగి స్త్రీలలో ఛాతి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. చక్కని దేహ సౌష్టవం సొంతమవుతుంది. అయితే ఈత కొట్టడం అలవాటు లేని వారు నిటారుగా నిలబడి గాల్లోకి ముందుకు వెనుకకు ఊగండి. దీనిని రోజుకు కనీసం 20 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. అదేవిధంగా మీ అరచేతులను వక్షాలపై పెట్టుకుని ఒకదానికొకటి కలిపి ప్రెస్ చేస్తూ 5 సెకన్లపాటు ఉంచండి. ఇలా 10 సార్లు చేసినా ఫలితం కనిపిస్తుంది.
వెల్లకిలా పడుకుని 5 నుంచి 10 కేజీల బరువులను చేతులతో ఎత్తి పైకి లేపుతూ వ్యాయామం చేస్తుండాలి. ఈ వ్యాయామం వల్ల కూడా వక్షోజాల పరిమాణం పెరుగుతుంది. ఇక ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సోయా ఉత్పత్తులు, నట్స్, విత్తనాలు, సముద్రపు ఆహారం, నారింజ లేదా నిమ్మజాతికి చెందిన పండ్లు, సోంపు గింజలు, బొప్పాయి, పాలు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలను రోజూ తీసుకుంటుంటే స్త్రీలలో వక్షోజాల పరిమాణం పెరుగుతుంది. అయితే వ్యాయామాలు చేసే వారు నిపుణులను సంప్రదిస్తే మంచిది. దీంతో త్వరగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.