Walnuts | ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ నట్స్‌ను తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అయితే చాలా మంది బాదం, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్‌ను తింటుంటారు. కానీ వాల్ నట్స్ జోలికి వెళ్లరు. వాస్తవానికి మిగిలిన నట్స్ కన్నా ఇవి ఎంతో బలవర్ధకమైనవని చెప్పవచ్చు. ఇతర నట్స్‌లో కన్నా వాల్ నట్స్లోనే పోషకాలు అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే వాల్ నట్స్‌ను తినాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. కానీ రోజుకు అసలు ఎన్ని వాల్ నట్స్‌ను తినాలి, అసలు వీటిల్లో ఉండే పోషకాలు ఏమిటి, ఈ నట్స్‌ను తింటే ఏం జరుగుతుంది.. అని సందేహిస్తుంటారు. అయితే ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వాల్ నట్స్‌ను రోజుకు 4 నుంచి 7 వరకు తినవచ్చు. వీటిని కనీసం 6 నుంచి 8 గంటల పాటు నీటిలో నానబెట్టి తినాల్సి ఉంటుంది.
వాల్ నట్స్‌ను నేరుగా తినడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. అలా తింటే కొందరికి వాంతికి వచ్చినట్లు ఉండడం, వికారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఈ నట్స్‌ను నీటిలో నానబెట్టి తినాల్సి ఉంటుంది. రాత్రి పూట నీటిలో నానబెట్టిన నట్స్‌ను ఉదయం తినాలి. లేదా ఉదయం నానబెడితే సాయంత్రం స్నాక్స్ రూపంలోనూ తినవచ్చు. ఇక వాల్ నట్స్‌ను తింటే మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నట్స్‌లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. వాల్ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఆల్ఫా లినోలీనిక్ యాసిడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. వాల్ నట్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్, బీపీ నియంత్రణలో ఉంటాయి. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె పోటు రాకుండా నివారించవచ్చు.
వాల్ నట్స్ చూసేందుకు అచ్చం మెదడు ఆకారంలోనే ఉంటాయి. అందువల్ల ఈ నట్స్‌ను బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఈ నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావం మెదడుపై పడకుండా చేస్తాయి. దీంతో మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. అలాగే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. పిల్లలకు ఈ నట్స్‌ను రోజూ తినిపిస్తే వారి మెదడు వికసిస్తుంది. చదువుల్లో రాణిస్తారు. తెలివి తేటలు పెరుగుతాయి. వాల్ నట్స్ ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. ఈ నట్స్‌ను తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వాల్ నట్స్‌లో చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాలిఫినాల్స్తోపాటు విటమిన్ ఇ, మెలటోనిన్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీర కణజాలానికి మరమ్మత్తులను నిర్వహిస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. అధికంగా బరువు ఉన్నవారు వాల్ నట్స్‌ను తమ రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాల్ నట్స్‌లో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ వీటిల్లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కనుక ఇవి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి. కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. కనుక బరువు తగ్గాలని చూస్తున్న వారు వాల్ నట్స్‌ను తింటుంటే ప్రయోజనం ఉంటుంది. ఇలా వాల్ నట్స్‌ను రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.