Coffee | రోజూ ఉదయం నిద్ర లేవగానే చాలా మంది కాఫీ లేదా టీ సేవిస్తుంటారు. అయితే కాఫీ ప్రేమికులు ప్రత్యేకంగా ఉంటారు. ఉదయం నిద్ర లేచాక వెంటనే గొంతులో కాఫీ పడకపోతే కొందరికి తృప్తిగా అనిపించదు. అలాంటి వారికి కాఫీ తాగకపోతే రోజు ప్రారంభం కాదు. చల్లని వాతావరణంలో వేడి వేడి కాఫీ తాగుతుంటే వచ్చే మజాయే వేరు. ఈ క్రమంలోనే కొందరు స్ట్రాంగ్ కాఫీ తాగుతారు. కొందరు చక్కెర ఎక్కువ వేసి తాగుతారు. అయితే డాక్టర్లు చెబుతున్న ప్రకారం కాఫీని రోజూ పరిమిత మోతాదులో తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయట. రోజూ కాఫీని తాగడం వల్ల పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని, మన శరీరానికి పలు లాభాలు కలుగుతాయని అంటున్నారు.
కాఫీలో కెఫీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది హృదయ సంబంధిత సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. కాఫీలో పలు పోషకాలు కూడా ఉంటాయి. మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ ఇ తదితర పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా కాఫీలో ఉంటాయి. కాఫీలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూస్తుంది. అలాగే పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. దీంతోపాటు గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. కాఫీని రోజూ మోతాదులో తీసుకుంటేనే ఈ లాభాలను పొందగలుగుతారు. అయితే అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కాఫీని తాగడం వల్ల ఆందోళన, కంగారు వంటి సమస్యలు కూడా తగ్గుతాయట. ఈ మేరకు ఫరీదాబాద్‌లోని ఏషియన్ హాస్పిటల్ హెడ్ డైటిషియన్ కోమల్ మాలిక్ చెప్పారు.
కాఫీని తాగడం వల్ల మన మూడ్ కూడా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. డిప్రెషన్ లేదా మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు కాఫీ తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు. కాఫీని తాగడం వల్ల మైండ్ రిలాక్స్ అయి మూడ్ మారుతుంది. అలాగే కాఫీలో ఉండే పాలిఫినాల్స్ శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఇక బరువు తగ్గాలనుకునేవారు కూడా కాఫీని తమ దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇక కాఫీని అసలు రోజుకు ఎన్ని కప్పుల వరకు తాగితే మంచిది..? అన్న విషయానికి వస్తే.. వైద్యులు చెబుతున్న ప్రకారం రోజుకు 2 నుంచి 3 కప్పుల వరకు కాఫీని సేవించవచ్చు. అంతకు మించితే మాత్రం ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగకపోగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కనుక కాఫీని రోజూ నిర్దేశించిన మోతాదులోనే తాగాల్సి ఉంటుంది.
ఇక కప్పు కాఫీ తాగితే సుమారుగా 100 మిల్లీగ్రాముల మేర కెఫీన్ లభిస్తుంది. మన శరీరానికి రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ తీసుకోవచ్చు. అంటే సుమారుగా 4 కప్పులు అన్నమాట. కనుక 3 కప్పుల కన్నా మించి కాఫీని సేవించకూడదు. దీంతో శరీరంలో కెఫీన్ పరిమాణం పెరిగిపోతుంది. ఇది ఉండాల్సిన మోతాదులో ఉంటే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ అధికంగా ఉంటే మాత్రం ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. కనుక కాఫీని రోజుకు 2 లేదా 3 కప్పులకు మించి తాగకూడదు. కాఫీని తాగేవారు అందులో చక్కెర కలపకుండా తాగితే మంచిది. బ్లాక్ కాఫీ తాగితే మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్‌ను అదుపు చేయవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇలా కాఫీని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.