Hibiscus Flowers Tea | మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో మందార పువ్వు మొక్క కూడా ఒకటి. ఇవి అనేక రకాలు ఉంటాయి. అయితే ఒకే రెక్క కలిగిన ఎరుపు రంగు మందార పువ్వుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మందార పువ్వులను ఎండబెట్టి వాటితో టీ తయారు చేసుకుని తాగవచ్చు. ఈ విధంగా రోజూ తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మందార పువ్వుల టీని తాగితే తాజాగా అనిపిస్తుంది. ఈ పువ్వుల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కనుక ఈ పువ్వులతో టీ తయారు చేసి తాగితే మనకు అనేక పోషకాలు లభించడంతోపాటు అనేక రోగాలు కూడా నయమవుతాయి. మందార పువ్వుల టీని కనీసం రోజుకు 1 కప్పు అయినా తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చు.
మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలు డ్యామేజ్ అవకుండా కాపాడుతాయి. దీంతోపాటు వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. మందార పువ్వుల టీని తాగడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రోజుకు ఒక కప్పు మందార పువ్వుల టీని తాగితే సిస్టోలిక్, డయాస్టోలిక్ బీపీ తగ్గుతుంది. అందువల్ల మందార పువ్వుల టీ బీపీ రోగులకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పవచ్చు.
మందార పువ్వుల టీని సేవించడం వల్ల కేవలం బీపీ తగ్గడం మాత్రమే కాదు కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి ఎల్డీఎల్. దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇంకొకటి హెచ్‌డీఎల్. దీన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు. మందార పువ్వుల టీని తాగితే ఎల్డీఎల్ తగ్గుతుంది. హెచ్‌డీఎల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. మందార పువ్వుల టీని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. కనుక బరువు తగ్గాలని చూస్తున్న వారికి ఈ టీ ఎంతగానో మేలు చేస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి ఈ టీని రోజూ సేవించాలి.
మందార పువ్వుల టీలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి లివర్ లోని వ్యర్థాలను బయటకు పంపి డిటాక్స్ చేస్తాయి. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. తరచూ మందార పువ్వుల టీని సేవిస్తుంటే లివర్‌ను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించుకోవచ్చు. దీంతో శరీరంలోని వ్యర్థాలను లివర్ మరింత సమర్థవంతంగా బయటకు పంపుతుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మందార పువ్వుల టీని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. దీంతోపాటు కడుపు ఉబ్బరం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. మందార పువ్వుల టీలో లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. కనుక మలబద్దకం తగ్గుతుంది. రోజూ సుఖ విరేచనం అవుతుంది.
మందార పువ్వుల టీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. వ్యాధులను రాకుండా చూస్తుంది. ఈ టీలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. మందార పువ్వుల టీని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగర్ ఉన్నవారు ఈ టీని రోజూ సేవిస్తుండడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇలా మందార పువ్వుల టీని సేవించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక రోజూ ఒక కప్పు తాగడం మరిచిపోకండి.