Heart attack | చలికాలం-గుండెపోటుకు సంబంధం ఉందా..? గుండెపోటు నివారణకు ఈ టిప్స్ పాటించండి..!
Heart attack | చలికాలంలో సాధారణ సమస్యలతో పాటు గుండె సంబంధ సమస్యలు కూడా వేధిస్తుంటాయి. చలికాలంతో గుండెపోటుకు సంబంధం ఉంటున్నందున ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అవసరమంటున్నారు నిపుణులు
Heart attack | ఈ నెలంతా చలికాలం మనల్ని వేధించనున్నది. చిన్నావాళ్లు మొదలు పండు ముసలి వాళ్ల వరకు చలికాలంలో అనేక రోగాల బారిన పడుతుంటారు. మరీ ముఖ్యంగా చలికాలంలో గుండెపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణం చలిగా ఉండటం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే ఛాతీనొప్పి, గుండె సంబంధ వ్యాధులతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కరోనరీ ఆర్టరీ సంకోచించడం వంటి సమస్యలు వస్తుంటాయి. చలికాలంలోనే గుండెపోటు సమస్యలు ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయో, వాటికి రెమెడీ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బయటి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మన శరీరాన్ని అవసరమైన ఉష్ణోగ్రతలో ఉంచేందుకు గుండె మరింతగా కష్టపడుతుంది. చలికాలం గాలులు పరిస్థితిని మరింత ఇబ్బందికరం చేస్తాయి. శరీర ఉష్ణోగ్రత 95 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే గుండె కండరాలకు హాని కలిగించవచ్చు. పెరిగిన రక్తపోటు కొరోనరీ ధమనులను ఇరుకైనదిగా చేసి గుండె, దాని కండరాలకు చేరే రక్తం, ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా గుండెపోటు రావచ్చు.
సరైన ఆహారం తీసుకోవడం..
వాతావరణం చల్లగా ఉండటంతో వేడివేడిగా ఏవైనా తినుబండారాలు తినాలనే కోరిక చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆహారం విషయంలో సమతుల్యత పాటించడం చాలా అవసరం. చలికాలంలో వేడివేడి తినుబండారాలు తినాలని కోరికగా ఉన్నా ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి. శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను అందించడం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. వివిధ విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. న్యుమోనియా, జలుబు వంటి వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తాయి.
ఫ్లూ నుంచి రక్షించుకోవడం..
ఫ్లూ జ్వరం మనపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. చలికాలం అంతా ఈ సమస్య మనల్ని వేధిస్తూనే ఉంటుంది. పెద్దవాళ్లు ఇప్పటికే గుండె సంబంధ సమస్య ఉన్నవారయితే ఫ్లూ వచ్చే అవకాశాలుంటాయి. వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో, నిత్యం ఎక్కువ మందితో కలిసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్లూ జ్వరం రావడానికి ముందు కనిపించే లక్షణాలపై ఓ కన్నేసి ఉంచి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
మందులను ట్రాక్ చేయడం..
చల్లని వాతావరణంలో శరీరం అంతటా రక్త ప్రసరణ చేపట్టేందుకు గుండె చాలా కష్టపడాల్సి ఉంటుంది. గుండె ఆరోగ్యం, ఇతర అంతర్లీన వ్యాధులను సరైన రీతిలో నిర్వహించినట్లయితే చలికాలంలో ఎలాంటి జలుబు వంటి సమస్య వచ్చినా ఎదుర్కోవచ్చు. నిత్యం వాడే మందుల టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేసుకోవాలి. రిమైండర్లను సెట్ చేసుకొని రిపీట్ ప్రిస్క్రిప్షన్లను ఆర్డర్ చేయడంపై దృష్టిపెట్టడం ద్వారా గుండె సంబంధ సమస్యలు మనల్ని వేధించకుండా చూసుకోవచ్చు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం..
మన శరీరం ఎక్కువ బరువుతో ఉన్నప్పుడు గుండె, రోగనిరోధక వ్యవస్థ అన్నీ ఒత్తిడికి లోనవుతాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్లతో పోరాడలేకపోవచ్చు. దీనికి తోడు కరోనా వైరస్ వ్యాపించినట్లయితే సమస్యను మరింత పెంచుతుంది. చలికాలంలో వ్యాయామం చేయాలంటే ఒళ్లు వంగదు. బద్దకం వేస్తుంది. ఇంటి వద్దనే చేయడానికి అవకాశం ఉన్న చిన్న చిన్న వ్యాయామాలను చేయడం వల్ల శరీరం వేడిని పొంది ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అందుకని చలికాలంలో కనీసం అర్ధ గంట సేపు ఇంటిపట్టునే వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి.
మానసికంగా ఆరోగ్యంగా ఉండటం..
చలికాలంలో పగలు సమయం తక్కువగా ఉండి, రాత్రి సమయం పెరగడం వాతావరణం మనల్ని నిరుత్సాహానికి గురిచేస్తుంది. సూర్యరశ్మి మన శరీరానికి అందకపోవడం వల్ల తగినంత విటమిన్ డీ లభించదు. ఇది మనల్ని తీవ్ర డిప్రెషన్‌కు గురిచేస్తుంది. చలికాలంలో 10-మైక్రోగ్రాముల విటమిన్ డీ సప్లింమెంట్ తీసుకోవడం మంచిదే అని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయాల్లో శరీరాన్ని పూర్తిగా కప్పిపెట్టేలా దుస్తులు ధరించాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

