Robert Pattinson | రాబర్ట్ స్టార్ హీరో కనుకే తొలుత వ్యతిరేకించాం.. జేమ్స్ బాండ్ ఎంపికపై జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
JamesBond | Jeff Bezos ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 'జేమ్స్ బాండ్' (James Bond) ఫ్రాంచైజీకి సంబంధించి ఒక సంచలన వార్త హాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Jeff Bezos ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ‘జేమ్స్ బాండ్’ (James Bond) ఫ్రాంచైజీకి సంబంధించి ఒక సంచలన వార్త హాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ గూఢచారి పాత్ర అయిన ‘007’గా ప్రముఖ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ (Robert Pattinson) ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఈ ఎంపిక వెనుక జరిగిన ఆసక్తికర పరిణామాలు, స్క్రీన్ టెస్టుల తంతును అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ స్వయంగా వెల్లడించారు.
అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ (Amazon MGM Studios) ఈ ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న తర్వాత రాబర్ట్ ప్యాటిన్సన్ను బాండ్‌గా ఎంపిక చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జెఫ్ బెజోస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎంపిక ప్రక్రియలో తాను కూడా భాగస్వామ్యుడనై నిశితంగా పరిశీలించినట్లు తెలిపారు. ఫైనలిస్టులుగా నిలిచిన ఐదుగురు అగ్రశ్రేణి నటులకు ఓల్డ్-స్కూల్ పద్ధతిలో రియల్ సెట్స్‌పై, పూర్తి కాస్ట్యూమ్స్‌తో కఠినమైన స్క్రీన్ టెస్టులు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మూడు వేర్వేరు సన్నివేశాల్లో అద్భుతంగా నటించినప్పటికీ, రాబర్ట్ ప్యాటిన్సన్ నటనలో ఏదో ప్రత్యేకమైన మ్యాజిక్ ఉందని బెజోస్ ప్రశంసించారు.
అయితే ఆరంభంలో రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపికపై తమ బృందంలో కొంత వ్యతిరేకత కూడా ఉండేదని బెజోస్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. రాబ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ ఉన్న స్టార్ హీరో. అందువల్ల బాండ్ పాత్ర కోసం అంతగా పరిచయం లేని కొత్త నటుడిని తీసుకుంటే బాగుంటుందేమో అని మేం కొద్దిగా ఆలోచించాం, కొంచెం బయాస్‌గా కూడా ఉన్నాం అని ఆయన గుర్తుచేసుకున్నారు.
కానీ, స్క్రీన్ టెస్టుల సమయంలో ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయని బెజోస్ స్పష్టం చేశారు. కెమెరా ముందు రాబర్ట్ ప్యాటిన్సన్ అభినయం చూశాక, అతడే అసలైన ‘జేమ్స్ బాండ్’ అని అందరికీ స్పష్టంగా అర్థమైందని తెలిపారు. ప్రముఖ దర్శకుడు డెనిస్ విలెన్యూవ్ (Denis Villeneuve)తో పాటు ప్రొడక్షన్ టీమ్ అంతా ఒక్కసారిగా రాబ్ వైపే మొగ్గు చూపారని, ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన వెల్లడించారు. అలా హాలీవుడ్ తెరపై సరికొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రయాణం ఖరారైందని అమెజాన్ బాస్ పేర్కొన్నారు.
Identity Confirmed https://t.co/FCU5A9c1wk
— James Bond (@007) November 16, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robert Pattinson | రాబర్ట్ స్టార్ హీరో కనుకే తొలుత వ్యతిరేకించాం.. జేమ్స్ బాండ్ ఎంపికపై జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jobs | నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో 145 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు
SIddipeta | సిద్దిపేటలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేసి కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలేస్తున్న సిబ్బంది.. వీడియో
Sonia Gandhi: పౌరసత్వం రాకముందే సోనియాకు ఓటు.. రిపోర్టు కోరిన ఢిల్లీ కోర్టు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

