న్యూఢిల్లీ : స్వీట్ లేనిదే భోజనం పూర్తికాదని భావించే వారు చాలా మంది ఉంటారు. డెజర్ట్ లేకుంటే మీల్స్ అసంపూర్తిగా మిగులుతుందనుకునే వారూ కోకొల్లలు. అయితే స్వీట్స్ అతిగా తీసుకుంటే మధుమేహ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తుండగా స్వీట్స్‌కు అసలు సిసలు ప్రత్యామ్నాయాలతో (Healthy Sweet Alternatives) టేస్టీ రెసిపీలనూ ఎంజాయ్ చేయవచ్చు.
షుగర్ తీసుకోగానే ఎండార్ఫిన్లు విడుదలై ఫీల్ గుడ్ భావన కలుగుతుంది. అయితే షుగర్‌ను మోతాదు మించి తీసుకుంటే ఊబకాయం, మధుమేహం, హృద్రోగ ముప్పు వెంటాడతాయి. స్వీట్స్ తీసుకోవాలనే కోరిక ఉండి బరువు తగ్గాలి, ఆరోగ్యంతో రాజీపడకూడదనుకునే వారు షుగర్ స్ధానంలో ప్రత్యామ్నాయాలను వాడుతూ ఇష్టమైన రెసిపీలను ఎంజాయ్ చేయవచ్చు.
అత్యవసర పోషకాలు, విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్‌ను స్వీట్ ఆల్టర్నేటివ్గా వాడవచ్చు. డ్రై నట్స్ సహజంగా స్వీట్‌గా ఉంటూ బరువు తగ్గే ప్రక్రియలోనూ తోడుగా నిలుస్తాయి. తీపిపదార్ధాలకు బదులు మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మీరు స్వీట్స్ తినాలనే కోరికను తీర్చుకోవడంతో పాటు క్యాలరీలను కూడా కట్టడి చేసినట్టవుతుంది. ఇక మీకు స్వీట్స్ తినాలనే కోరికను చంపుకోకుండా ఆరోగ్యకరమైన డైట్‌నూ భాగం చేసుకోవాలంటే వీటిని ట్రై చేయండి..
డ్రై ఫ్రూట్స్
స్వీట్ పొటాటోస్
డార్క్ చాక్లెట్ కవర్డ్ ఫ్రూట్
యోగర్ట్
Read More :
Tandoori Recipes | ఈ తందూరి డిష్‌లతో వింటర్ బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేయండి