పీరియడ్స్ ముందు ఆ కోరికలేంటి?
నమస్తే మేడం. నా వయసు 25 సంవత్సరాలు. బొద్దుగా ఉంటాను. బరువు తగ్గాలని న్యూట్రీషియన్ సాయంతో డైట్ పాటిస్తున్నాను. నాకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అయితే, నెలసరికి ముందు చాక్లెట్లు, చిప్స్, బిర్యానీలాంటివి తినాలని విపరీతంగా కోరిక కలుగుతున్నది.
నమస్తే మేడం. నా వయసు 25 సంవత్సరాలు. బొద్దుగా ఉంటాను. బరువు తగ్గాలని న్యూట్రీషియన్ సాయంతో డైట్ పాటిస్తున్నాను. నాకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అయితే, నెలసరికి ముందు చాక్లెట్లు, చిప్స్, బిర్యానీలాంటివి తినాలని విపరీతంగా కోరిక కలుగుతున్నది. ఎంత వద్దనుకున్నా తినకుండా ఉండలేకపోతున్నాను. దీంతో నా డైట్ పాడవుతున్నది. ఎందుకిలా జరుగుతున్నది. నేనేం చేయాలి?
- ఓ పాఠకురాలు
ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం పీరియడ్స్‌కి, ఆహారంలో మార్పులకు సంబంధం లేదు. మీకు బరువు తగ్గాలని ఉంది. అదే సమయంలో ఈ మార్పుల వల్ల నెలసరిలో ఏమన్నా సమస్యలు వస్తాయేమో అని భయంగానూ ఉంది. ఆ రెండిటి మధ్యా ఏర్పడుతున్న సంఘర్షణ వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతున్నది. దీన్ని అధిగమించాలంటే సైకాలజిస్ట్ దగ్గర కౌన్సెలింగ్ తీసుకోవాలి. బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఆహారాన్ని నియంత్రణలో ఉంచుకోవడం అత్యవసరం. అలాంటప్పుడు తిండి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు.
మరీ ఆకలిగా ఉండి, ఏదన్నా తినాలి అనిపిస్తే కీరా, టమాటాల్లాంటివి తినాలి. అంతే తప్ప చిప్స్, చాక్లెట్లే కావాలి అనుకోకూడదు. కానీ అవే కావాలి అనిపించడం, కేవలం మీ మానసికమైన విషయం. ఒక పదార్థం తినాలి అని విపరీతమైన కోరికలు గర్భిణిగా ఉన్నప్పుడు కలుగుతాయి కానీ, పీరియడ్స్ సమయంలో అలా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే… గతంలో అవి బాగా అలవాటు అవ్వడం వల్ల, మీకు వాటిని తినాలన్న కోరిక ఉంది. దాన్నే మీరు మెన్సెస్ ముందు… అంటూ ఆపాదించుకుంటున్నారు. అసలు అలాంటి సమస్యే ఉండదు. ఆ పేరుతో మీరు డైట్‌ని పాడుచేసుకుంటే ఎప్పటికీ సన్నగా కాలేరు. కాబట్టి మీరు కౌన్సెలింగ్‌కి వెళితే ఈ ఆలోచనను మీ బుర్ర నుంచి ఎలా తీసివేయవచ్చో చెబుతారు.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

